వైయ‌స్ జగన్ కు శుభాకాంక్షలు: డీఎంకే చీఫ్ స్టాలిన్ 

అమ‌రావ‌తి:  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లతో భారీ మెజారిటీ సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం 25 లోక్ సభ స్థానాలకు గానూ 22 సీట్లను దక్కించుకుంది ఈ నేపథ్యంలో డీఎంకే అధినేత, తమిళనాడు ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో జగన్ నాయకత్వంలోని వైయ‌స్ఆర్‌సీపీ  అద్భుతమైన ప్రదర్శన చేసిందని ప్రశంసించారు. ఆయన ముఖ్యమంత్రిగా విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. 

‘నా స్నేహితుడు, ఏపీకి కాబోతున్న ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ కు శుభాకాంక్షలు. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో అద్భుతమైన ప్రదర్శన చేశారు. ఆయన పదవీకాలం విజయవంతం కావాలనీ, ఏపీతో పాటు దక్షిణాది సరికొత్త ఎత్తులకు చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.

Back to Top