స్పీకర్‌ : అంబటిరాంబాబు - మే17,2012

ఈ రోజు హైకోర్టులో ప్రభుత్వం అర్ధరాత్రిపూట హడవిడిగా సాక్షి టెలివిజన్‌, సాక్షి పేపర్‌కు గవర్నమెంట్‌ అడ్యడైజ్‌ మెంట్‌లను ఇవ్వకూడదని విడుదల చేసిన జీఒని హై కోర్టు స్టే ఇచ్చింది.. మా పోరాటం ఇలానే కొనసాగుతుంది.
 గత రెండు రోజున నుండి సాక్షి కి సంబందించిన అస్తులను ఎటాచ్‌ చేయబోతున్నారని ఒక వర్గం మీడియా శివతాండవం చేస్తుంది. మొదటి పేజిల్లో భయంకరమైన స్టోరిలు నడుపుతుంది. సాక్షిని మూసివేయబోతున్నారని భావనతో ముఖ్యంగా ఈనాడు , ఆంధ్రజ్యోతి రాధాకృష్ట పిచ్చిపిచ్చి గా రాతలు రాస్తున్నారు.వారు ఎప్పటినుండో సాక్షి పై కక్ష కట్టిన వ్యక్తులు. ప్రభుత్వం అకౌంట్స్‌  సీజ్‌ చేస్తే సాక్షిని మూసివేస్తారని సంకేతాలు పంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే జగన్‌మోహన్‌రెడ్డి గారి సంస్ధలన్ని కూడ టేకోవర్‌ చేసుకోబోతున్నారని, మూసివేయబోతున్నారని త్వరలో జగన్‌మోహన్‌రెడ్డిని అరెస్ట్‌ చేయబోతున్నారని మాటలు మాట్లాడుతున్నారు. ఇది ప్రజాస్వామ్య దేశం అంతిమంగా న్యాయమే గెలుస్తుంది. 
సీబీఐ ఎంక్యరిదేని మీద జరుగుతుంది.26 జీఓలు రాజశేఖరరెడ్డిగారి టైంలో అక్రమంగా విడుదలచేశారని దాని మీద జరుగుతుంది. జీఓలు విడుదల చేసిన మంత్రులు మాత్రం క్షేమంగా ఉన్నారు.....అదే జగన్‌మోహన్‌రెడ్డి మీద దాడి చేయడానికి ప్రయత్నంచేస్తున్నారు. ఇంతవరకు26 జీఓల్లో తప్పు ఉన్నదా,క్యిట్‌ ప్రోకో జరిగిందా అనితేలలేదు. సాక్షి గోంతునోక్కడానికి ఈనాడు. ఆంధ్రజ్యోతి ప్రయత్నం చేస్తున్నాయి. మీరు నిజంగా జగన్‌మోహన్‌ రెడ్డిగారి కంపెనిల్లో పెట్టినటువంటి పెట్టుబడులు అక్రమమో సక్రమమో తేల్చవలసిన మీరు అక్రమమా సక్రమమా అని మాట్లాడుకోకుండా సాక్షి గోంతు నోక్కేస్తే జగన్‌మోహన్‌రెడ్డి గారి మాటలను ప్రజలువినలేరని ఉప ఎన్నికల్లో కోలుకోవచ్చఅని వాయిలార్‌ రవి వచ్చినదగ్గర నుండి  ప్రయత్నంచేస్తున్నారు. 
కాంగ్రెస్‌ పార్టీ వారు ఓ సర్వే చేయించుకున్నారు. సర్యే పేరు నిల్సన్‌ సర్వే, సర్వేలో ఒక్క నియోజకవర్గంలోకూడ కాంగ్రెస్‌ పార్టీ గెలిచే అవకాశంలేదని వారు గమనించిన తర్వాత, వారికి ప్రజామోద 31 శాతం ఉంది.

అలాంటి సర్యే చూసిన తర్వాత చిరంజీవి గారు, బోత్స సత్యనారాయణ గారు, కిరణ్‌కుమార్‌ రెడ్డిగారు గాంధీ గారిమూడుకోతులు లాగా తయారు అయ్యారు. చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చూడకు, అంటే ఈ ముగ్గురు మాత్రం చెడు చెప్పాలి చెడు చేయాలి, చెడు మాట్లాడాలి అని ఇదే కార్యక్రమంలో ఈ మూడు కోతులు ల్లుతాగిన కోతుల్లా ఈ సర్యే చసిన తర్వాత నాట్యం చేస్తున్నారు.ఎదో విదంగ జగన్‌మోహన్‌రెడ్డిగారి పార్టీని నిలువరింపచేయాలని ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ కన్నా ముందే పేపర్‌ స్ధాపిస్తే దానిలో అవినీతి ఉన్నదని మాట్లడుతున్నారు. అప్పుడు ఏంచేస్తున్నారు అని అడుగుతున్నా.....రాజశేఖర్‌రెడ్డిగారు మరణించిన తర్వాత జరుగుతున్నా ప్రతి పరిణామాన్ని ప్రజలు గమనిస్తున్నారు.నిమ్మగడ్డ ప్రసాద్‌ గారిని అరెస్ట్‌ చేస్తే ఈనాడు లో ఫ్రంట్‌ పేజిలో వేశారు.ఈనాడు వారిని అడుగుతున్నా ప్రసాద్‌ అనేవ్యక్తి సాక్షిలోనే కాక మాటీవిలో కూడ పెట్టుబడులు పెట్టారు. మాటీవిని సోని గ్రూప్‌కు పంబందించిన వారు టేకోవర్‌ చేసారు.మాటీవి కన్నా ముందుగా ఈటీవిని టేకోవర్‌ చేద్దామని వెళితే ఈటీవిలో  ఏమిలేదని ఉత్త డోల్లని తేలింది అందుకే మాటీవిలో మేజర్‌ షేర్ల్‌ కోనుక్కున్నారు. అందుకే దుగ్దతో ఈనాడు పేపర్లో ప్రసాద్‌గారి మీద కధనాలు రాస్తున్నారు. ఒక మీడియా ప్రయోజనాన్ని కాపాడడంకోసం ఒక రాజకీయపార్టీ ఒక సీబీఐ వారికిపనిచేస్తు ఉంటే,ఒక మీడియాలని అనగదోక్కడంకోసం ఈ మీడియా అంతా రామోజిరావుగారు,రాధాకృష్టగారు కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలకు సపోర్టుచేసే పరిస్ధితి ఉంది. సాక్షి మీద వస్తున్న పుకార్లని ఎవరు నమ్మవద్దు.

తాజా వీడియోలు

Back to Top