మాయమాటలతో బాబు కాలం వెల్లదీస్తున్నాడు


విశాఖపట్నం: మాయమాటలు చెబుతూ చంద్రబాబు నాలుగున్నరేళ్లుగా కాలం వెల్లదీస్తున్నాడని విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గం రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ అని రైతాంగాన్ని నట్టేట ముంచాడని మండిపడ్డారు. చోడవరం నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో స్థానిక రైతులు ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఈ మేరకు వారి సమస్యలను జననేతకు వివరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో వ్యవసాయ రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని మోసం చేశారన్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీ ఇప్పటికీ నెరవేర్చలేదన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో వడ్డీ లేని రుణాలు పొందామని, చంద్రబాబు వడ్డీలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. వైయస్‌ఆర్‌ హయాంలో రుణం పూర్తిగా మాఫీ అయ్యిందన్నారు. 
 
Back to Top