దళితులపై దాడులకు వ్యతిరేకంగా రాజమండ్రిలో వైయ‌స్ఆర్‌సీపీ నిరసన

అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం 

రాజమండ్రి: దళితులపై జరుగుతున్న అమానుష దాడులు, అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రాజమండ్రి గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. వైయ‌స్ఆర్‌సీపీ ఆదేశాల మేరకు మాజీ పార్లమెంట్ సభ్యుడు, జాతీయ అధికార ప్రతినిధి మార్గాన్ని భరత్ రామ్ ఆధ్వర్యంలో నిర‌స‌న‌ కార్యక్రమం చేప‌ట్టారు. ఈ సందర్భంగా నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ 3 టౌన్ సిఐకు ఫిర్యాదు పత్రం అందజేశారు. కార్య‌క్ర‌మంలో మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు టి.జె.ఆర్ సుధాకర్ బాబు,  రిటైర్డ్ జడ్జి జడ శ్రావణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకటరావు, రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్, మాజీ ఏపీ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్‌పర్సన్, మాజీ రుడా చైర్‌పర్సన్ మేడపాటి షర్మిళ రెడ్డి, వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ఎస్సీ అధికార ప్రతినిధి కాటం రజనీకాంత్, ఎస్సీ సీనియర్ నాయకుడు దాసి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. 

May be an image of text

May be an image of one or more people, crowd and text

Back to Top