30న “మన మూలపేట పోర్ట్‌కు పోదాం పదండి” 

కార్యక్రమం విజయవంతం చేయాల‌ని ధర్మాన ప్రసాదరావు పిలుపు 

శ్రీకాకుళం : “మన మూలపేట పోర్ట్‌కు పోదాం పదండి” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. ఈ నెల 30న జరగనున్న కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లపై శ్రీకాకుళం రూరల్ మండలం, శ్రీకాకుళం కార్పొరేషన్, గార మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు మాట్లాడుతూ.. మూలపేట పోర్ట్ అభివృద్ధి ప్రాంత ప్రగతికి కీలకమని, ప్రజలందరూ భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.  ఈ సమావేశంలో యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు, శ్రీకాకుళం నియోజకవర్గ పరిశీలకులు పిన్నిటి సాయికుమార్ పాల్గొన్నారు. కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహించేందుకు కార్యాచరణపై చర్చించారు. ఈ సమావేశంలో రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు, ఎస్‌ఈసీ సభ్యులు, నియోజకవర్గ పరిశీలకులు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ ముఖ్య నాయకులు, యువజన విభాగం, సోషల్ మీడియా కార్యకర్తలు, మహిళలు, అభిమానులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
 

Back to Top