వైయస్‌ఆర్‌సీపీ పలాస సమన్వయకర్త అప్పలరాజుశ్రీకాకుళం: ప్రజలంతా తలెత్తుకొని బతకాలంటే వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాల్సిందే అని అప్పలరావు అన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పలాస కేటీ రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ఆర్‌సీపీ పలాస సమన్వయకర్త అప్పలరాజు మాట్లాడారు. ఒక్క అడుగు కోసం వేలాది మంది ఎదురు చూస్తున్నారన్నారు. ఈ నెల 29వ తేదీన వైయస్ జగన్ పలాస నియోజకవర్గంలో అడుగుపెట్టారన్నారు. ఈ ప్రజలు పలికిన అఖండ స్వాగతం ఎన్నటికి మరిచిపోలేనిదన్నారు. ఈ నియోజకవర్గంలోని రైతులంతా తలెత్తుకొని బతకాలంటే వైయస్ జగన్ సీఎం కావాలన్నారు. పేదలందరూ గౌరవంగా బతకాలంటే జగనన్న రావాలని కోరుతున్నారన్నారు. మీ అడుగు కోసం ఎన్నో రోజులుగా పలాస ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. పలాస నియోజకవర్గాన్ని అభివృద్ధిపథంలోకి తీసుకెళ్లాలని కోరుతున్నారన్నారు.