52వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్‌

 

చిత్తూరు: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 52వ రోజు షెడ్యూల్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. గురువారం ఉదయం 8 గంటలకు చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలోని కలికిరి వద్ద బస చేసే ప్రాంతం నుంచి వైయస్‌ జగన్‌ పాదయాత్ర మొదలవుతుంది. 8.30 గంటలకు అసిపిరెడ్డిగారిపల్లె, 9 గంటలకు కొత్తపల్లి క్రాస్, 9.30 గంటలకు పుంగనూరు నియోజకవర్గంలోని కరివండ్లపల్లి క్రాస్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి 10.30 గంటలకు ఉత్తుపల్లిక్రాస్, 11 గంటలకు మిట్టపల్లికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు భోజన విరామం. 3 గంటలకు తిరిగి వైయస్‌ జగన్‌ పాదయాత్ర సదూం మండలం నుంచి పునఃప్రారంభమవుతుంది. 3.30 గంటలకు పెద్దూరు, 4.30 గంటలకు చెరువు ముండరిపల్లి, 5 గంటలకు చెనకవారిపల్లె, 5.15 గంటలకు కురువపల్లికి వైయస్‌ జగన్‌ చేరుకుంటారు.
 

తాజా ఫోటోలు

Back to Top