<br/>తూర్పు గోదావరి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కుయ్యేరు గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ శ్రేణులు, స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామస్తులు జననేతను కలిసి తమ గ్రామంలో అంతర్గత రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, మంచినీటి సమస్య వేధిస్తుందని ఫిర్యాదు చేశారు. వారి సమస్యలు విన్న వైయస్ జగన్ మనందరి ప్రభుత్వం రాగానే మంచి చేస్తానని హామీ ఇచ్చారు.