విశాఖ: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి కొద్ది సేపటి క్రితమే చోడవరం పట్టణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జననేతకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వేలాదిగా జనం తరలిరావడంతో చోడవరం పోటెత్తింది. అశేష జనవాహినిని ఉద్దేశించి వైయస్ జగన్ ప్రసంగించనున్నారు.