విజయనగరం: రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్న చంద్రబాబు పాలనను తుదముట్టించేందుకు, ప్రజల సమస్యలు తెలుసుకుని వారికి నేనున్నానంటూ భరోసానిచ్చేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేత 303వ రోజు పాదయాత్రను బుధవారం ఉదయం కురుపాం శివారు నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి దాసరి పేట, తాళ్లడుమ్మ, చిన్న మేరంగి, అల్లువాడ, పెద తుంబిలి, చిన్న తుంబిలి, జోగులదమ్మ మీదుగా శిఖబడి క్రాస్ వరకు పాదయాత్ర కొనసాగనుంది.
వైయస్ జగన్ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతారణం నెలకొంది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఆ సంకల్ప సూరీడు తమ ప్రాంతానికి రానున్నాడనీ.. తమ జీవితాల్లోకి వెలుగులు తెచ్చేందుకు పాటుపడుతున్నాడనీ.. ఆయనతో తమ గోడు చెప్పుకుని గుండెల్లోని వేదన దింపుకోవచ్చునని జనం ఆరాట పడుతున్నారు. జననేత తమ ప్రాంతానికి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నారు.