కొండవెలగాడ నుంచి 277వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

 

విజయనగరం: అలుపెరగని బాటసారికి అడుగడుగునా నీరాజనాలు పడుతున్నారు. తమ కష్టాలు తీర్చే నేత వస్తున్నాడని తెలిసి తెగ సంబరపడుతున్నారు. ఉప్పొంగిన అభిమానంతో పూలతివాచీ పరిచి సాదర స్వాగతం పలుకుతున్నారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, కళా బృందాలు, డప్పుల మోతలతో పాదయాత్ర జరిగిన ప్రాంతాలు పండగను తలపిస్తున్నాయి. వైయ‌స్ఆర్‌సీపీ  అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తలపెట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం నెల్లిమర్ల నియోజకవర్గంలోని  నెల్లిమర్ల మండలం కొండవెలగాడ నుంచి 277వ రోజు పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి జరజాపుపేట, లక్ష్మీదేవిపేట మీదుగా పాదయాత్ర సాగుతుంది. అనంతరం భోజన విరామం తీసుకుని మళ్లీ నెల్లిమర్ల మెయిదా జంక్షన్‌ వరకు పాదయాత్ర కొనసాగిస్తారు. అక్కడ జరిగే భారీ బహిరంగ సభలో వైయ‌స్‌ జగన్‌ ప్రసంగిస్తారు. జ‌న‌నేత‌ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. దారిపొడవునా సమస్యలు తెలుసుకుంటూ వైయ‌స్‌ జగన్‌ ముందుకు సాగుతున్నారు. 


Back to Top