పవన్‌ సినిమాకు చంద్రబాబే డైరెక్టర్‌




– ఓట్లు, సీట్ల కోసమే చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాను వాడుకున్నారు.
– 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో రాజాంలో ఏం మేలు జరిగింది?
– రాజాంలో 3 నెలల్లో రోడ్ల విస్తరణ చేస్తామని చంద్రబాబు చెప్పారు
– జన్మభూమి కమిటీలు పెట్టి పింఛన్లు తొలగించారు
– కరెంటు బిల్లులు కట్టలేక పరిశ్రమలు మూతపడుతున్నాయి
– రక్షిత మంచినీరు కావాలని ప్రజలు అడిగినా ప్రభుత్వం స్పందించడం లేదు
– నీరు–చెట్టు పేరుతో రూ.20 కోట్ల అవినీతి
– కిడ్నీ వ్యాధితో 24 మంది చనిపోయారు
– చంద్రబాబు తీరు చూస్తే శవాలపై చిల్లర ఏరుకున్నట్లు ఉంది. 
– నామినేషన్‌ పద్దతిలో సబ్‌ కాంట్రాక్టర్లు తెస్తున్నారు. 
– ఖాళీగా ఉన్ను టీచర్‌ పోస్టులు భర్తీ చేయడం లేదు
– కేవలం 7 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌  ఇచ్చారు
– నాడు మొద్దబ్బాయి రాహుల్‌..ఇవాళ మేధావి
– జూన్‌ 8న చంద్రబాబు అవినీతిపై కాంగ్రెస్‌ పుస్తకం విడుదల చేసింది
– బాబు చెప్పిన ప్రతీ అబద్ధం, అవినీతిలో పవన్‌ భాగస్వామి కాదా? 
– చంద్రబాబుతో పవన్‌ కల్యాణ్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌
– ఇంతకన్న దిక్కుమాలిన సీఎం ఎక్కడైనా ఉంటారా? 
–చదువుల విప్లవం తెస్తాం
– ప్రతి పేదవాడి చదువుల బాధ్యత నాదే
–ఎన్ని లక్షలు ఖర్చైనా నేనే భరిస్తా
– అధికారంలోకి రాగానే ఇంటింటా నవరత్నాలు
– కంబాలు జోగులును ఆశీర్వదించండి

శ్రీకాకుళం: చంద్రబాబు వంటి దిక్కుమాలిన ముఖ్యమంత్రి ఎక్కడా ఉండరని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విమర్శించారు. టీడీపీతో నాలుగేళ్లు కలిసి కాపురం చేసిన పవన్‌ కళ్యాణ్‌ ఇవాళ బయటకు వచ్చి విడిపోయినట్లు నటిస్తున్నారని, ఈ సినిమాకు చంద్రబాబే డైరెక్టర్‌ అని వైయస్‌ జగన్‌ అభివర్ణించారు. సోమవారం ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా జిల్లాలోని రాజాం పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..వైయస్‌ జగన్‌ మాటల్లోనే..

– చంద్రబాబు దాదాపు 14 సంవత్సరాలుగా పరిపాలన,  ఇన్నాళ్ల పాలనలో ఓట్ల కోసం, సీట్ల కోసమే ఈ జిల్లాను వాడుకున్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి ఈ జిల్లాకు ఏం మేలు చేశారని ఇక్కడి ప్రజలు అడుగుతున్నారు. అందరి కన్న సీనీయర్‌ ముఖ్యమంత్రిని అని మాట్లా డుతారు కానీ, మాకేం చేశారని ప్రజలు అడిగితే ఆయన నోట్లో నుంచి మాటలు రావు.
– దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలన గురించి ఇక్కడి ప్రజలు చెప్పుకొస్తున్నారు.  ఇదే నియోజకవర్గంలో నాన్నగారు సీఎం అయ్యాకే ఆర్టీసీ బస్టాండ్‌కు శ్రీకారం చుట్టారని, రోడ్డు వేయించారని, రూ.47 కోట్లతో కాల్వల నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తే..ఇవాల్టికి కూడా ఆప నులు నత్తనడకన సాగుతున్నాయి. తోటపల్లి రిజర్వాయర్‌ పనులు ఎక్కడికక్కడే అంటున్నారు.
– రాజాం నియోజకవర్గంలో 32 వేల ఇల్లులు కట్టించారని నాన్నగారిని గుర్తు చేసుకుంటున్నారు. నాన్నగారి హాయంలో మడ్డువలసలో రెసిడెన్సియల్‌ కాలేజీ ఏర్పాటు చేశారని చెబుతున్నారు. 
– నాన్నగారు సీఎం అయ్యాక చాలా గొప్ప పనులు చేసి చూపించారని ప్రజలు చెప్పుకుంటున్నారు. చంద్రబాబు 2015, జనవరి 6వ తేదీ రాజాంకు వచ్చి జన్మభూమి– మాఊరి కార్యక్రమం నిర్వహించిన సందర్భంలో రాజాంలో మూడు నెలల్లో రోడ్లు విస్తరణ పనులు చేపడుతామని చెప్పారన్నా..ఇంతవరకు రూ.10 కోట్లు కూడా ఇవ్వలేదని ఇక్కడి ప్రజలు చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఈ రోడ్లలో నడవరు కాబట్టి దుమ్ము, దూళి కనిపించదంటున్నారు. రాజాంలో శాటిలైట్‌ సిటీ కడతామన్నారు. ఎక్కడైనా కనిపించిందా? నాలుగు చెరువులను పార్కులుగా చేస్తామన్నారు. ఇదే పెద్ద మనిషి ముఖ్యమంత్రి హోదాలో డిగ్రీ కాలేజీ భవనాలు నిర్మిస్తామన్నారు. ఎక్కడైనా కనిపించాయా?. తోటపల్లి కుడి, ఎడమ కాల్వల అధునీకరణ పనులు చేస్తామన్నారు. ఎన్నికలకు కేవలం మూడు నెలలు మాత్రమే ఉంది. ఇన్నాళ్లు ఈయన తోటపల్లిని పట్టించుకోలేదు. కానీ ఇప్పుడేమో ఆధునీకరణ పేరుతో టెండర్లు పిలిస్తున్నారు. టెంకాయలు కొట్టి డ్రామాలు చేస్తున్నారు. చంద్రబాబు అలసత్వం కారణంగా 23 వేల ఎకరాలకు చెందిన రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. నాలుగున్నరేళ్ల పాలనలో కనీసం పిల్ల కాల్వలు కూడా పూర్తి చేయలేదు. మొద్దు వలస కుడి కాల్వ ఆధునీకరణ పనులు ఇవాల్టికి నత్తనడకన సాగుతున్నాయని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. చంద్రబాబు హయాంలో జరిగిందేమిటి అంటే..జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి గ్రామాల్లో ఉన్న పింఛన్లు ఊడిబెరుకుతున్నారు. నాలుగున్నరేళ్ల పాలనలో ఈ నియోజకవర్గంలో 18 స్కూళ్లు మూత వేయించారు. ప్రభుత్వ పాఠశాలలను బాగు చేయాలని ఏ ముఖ్యమంత్రి అయినా ఆరాట పడుతారు. కానీ చంద్రబాబు మూత వేయిస్తున్నారు. 
– ఇదే నియోజకవర్గంలో రెండు హాస్టళ్లను మూత వేయించారు. ఇదే నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉంటే 108 వాహనం ఒక్కటే ఒక్కటి ఉంది. 108కి ఫోన్‌ కొడితే కుయ్‌..కుయ్‌ అంటూ 20 నిమిషాల్లో రావాల్సిన అంబులెన్స్‌ ఇవాళ నియోజకవర్గానికి ఒక్కటి తిరుగుతుంటే సిగ్గుతో తలదించుకోవాలి.
– చంద్రబాబు పాలనలో కొత్త పరిశ్రమలు, ఉద్యోగాల పరిస్థితి దేవుడెరుగు. ఈయన పాలనలో ఉన్న పరిశ్రమలు మూతపడుతున్నాయి. స్టీల్‌  ఇండస్ట్రీ, ఆయిల్‌ మిల్లులు, జ్యూట్‌ మిల్లులు మూతపడ్డాయి. ఈ నియోజకవర్గంలో 18 పరిశ్రమలు మూత పడ్డాయి. 20 వేల మంది రోడ్డున పడ్డారు. కారణం గతంలో కరెంటు రేట్లు రూ.3 ఉంటే చంద్రబాబు సీఎం అయ్యాక రూ.8లకు ఎగబాకాయి.
– నాన్నగారి పాలనలో పరిశ్రమలకు చౌకగా కరెంటు ఇచ్చేవారు. చంద్రబాబు మాత్రం ఏమంటారు. విశాఖలో మీటింగ్‌ పెట్టి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలు అంటూ ఊదరగొడుతున్నారు. నాగావలిపై వంతెన కోసం 51 రోజులుగా దీక్ష చేస్తున్నారు. 50 గ్రామాలకు సంబంధించిన సమస్య ఇది. ఒక్క వంతెన కట్టలేని అధ్వాన్నమైన పాలన చూస్తున్నాం.
– రేగడి మండలంలోని కిడ్నీ బాధితులు నావద్దకు వచ్చి బాధపడ్డారు. అన్నా..ఇటీవల ఒక్క గ్రామంలోనే 20 మంది కిడ్నీ వ్యాధితో బా«దపడుతూ చనిపోయారన్నా అన్నారు. నిజంగా ఇదోక పాలనా? చంద్రబాబు పాలనలో నీరు–చెట్టు పేరుతో ఈ నియోజకవర్గంలో రూ.20 కోట్ల అవినీతి జరిగింది. నాగవళి నదిలో ఇసుక దోపిడీ జరుగుతుందని చెబుతున్నారు. వంగర మండలం మడ్డువలస వద్ద పాండవుల కొండను కబ్జా చేసి గ్రైనెట్‌ పరిశ్రమలు ఏర్పాటు చేశారు. అక్కడి మెటీరియల్‌ సీజ్‌ చేస్తే ఆ అధికారులను ఇక్కడి మంత్రి కళా వెంకట్రావ్‌ దగ్గరుండి బదిలీ చేయించారు. ఉన్న గ్రైనైట్, యంత్రాలను తెచ్చుకున్నారు. మంత్రిగా ఉన్న వ్యక్తి గ్రైనైట్‌ తవ్వకాలను ప్రోత్సహిస్తున్నారు.
– ఇ దే నియోజకవర్గంలో అగ్రిగోల్డు ఆస్తులు చంద్రబాబు ఎలా దోచుకుంటున్నారో మనమంతా చూస్తున్నాం. అగ్రిగోల్డు విషయంలో విచారణ అంటారు. సీఐడీ విచారణ ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలుసు. ఇండి ట్రేడ్‌ పేరుతో ఇదే నియోజకవర్గంలో అక్షరాల రూ.120 కోట్లు దోచేశారు. ఆ దోచేసిన దానిపై సీఐడీ విచారణ చేస్తున్నారట. అంటే అధికారంలో ఉన్న పెద్ద  మనుషుల జోలికి పోరు. ఆ డబ్బులు తెప్పించి ప్రజలకు ఇ వ్వాల్సింది పోయి ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు.
– చంద్రబాబు హయాం గురించి, ఈ నియోజకవర్గం గురించి చెప్పుకోవాల్సి వస్తే..తిత్లీ తుఫాను మొన్ననే వ చ్చింది. తుపాను వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో రూ.3435 కోట్ల నష్టం వచ్చిందని చెప్పారు. ఈ నియోజకవర్గంలో వెయ్యి ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. కానీ చంద్రబాబు ఈ నియోజకవర్గానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. రూ,3435 కోట్లు నష్టం వాటిల్లిందని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం కేవలం రూ.500 కోట్లు మాత్రమే కేటాయించింది. ఏ ఆర్టీసీ బస్సు చూసినా చంద్రబాబు పోటో కనిపిస్తుంది. తుపాను బాధితులను ఆదుకున్నట్లు ఫోటోకు ఫోజులు కొడుతున్నారు.  ఇంతవరకు రూ.250 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. చంద్రబాబు రాజకీయాలను చూస్తే ఒక సామెత గుర్తుకు వస్తుంది. శావాల మీద చిల్లర ఏరుకునే రకం అన్నది గుర్తుకు వస్తుంది. చంద్రబాబు పనితీరు అలాగే ఉంది.
– నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలన గురించి ఆలోచన చేయండి. మరో మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఒక్కసారి మీగుండెలపై చేతులు వేసుకొని మీకు ఎలాంటి నాయకుడు కావాలో ఆలోచన చేయండి. నాలుగున్నరేళ్ల పాలనలో రైతులు, డ్వాక్రా మహిళలకు ఇచ్చిన రుణమాఫీ అమలు కాలేదు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పారు. జాబు ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి రూ.2 వేలు ఇస్తామన్నారు. ఎన్నికలకు నాలుగు నెలల ముందు కేవలం 2 లక్షల మందికి వెయ్యి రూపాయలు మాత్రమే నిరుద్యోగ భృతి ఇచ్చి చేతులు దులుపుకున్నారు. కరెంటు, ఆర్టీసీ చార్జీలు బాదుడే బాదుడు. ఇంటి పన్నులు, స్కూల్‌ ఫీజులు విఫరీతంగా పెంచారు. రేషన్‌ షాపుల్లో బియ్యం తప్ప మరేమి ఇవ్వడం లేదు. ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులు భర్తీ చేయడం లేదు. ఆస్తులు అమ్మి పిల్లలను చదివించుకుంటున్నురు. ఆరోగ్యశ్రీ పథకం పూర్తిగా పడకేసింది. లక్షలు ఖర్చు చేసి వైద్యం చేయించుకోవాల్సి వ స్తోంది. ఇవాళ కనీసం రూ.50 వేలు ఖర్చు చేస్తే కానీ ప్రసవం చేయడం లేదు. రాష్ట్రం అతులాకుతలం అవుతున్నా పట్టించుకోకుండా ప్రతి రోజు విమానం ఎక్కి ఒక రోజు తమిళనాడు, మరో రోజు కర్నాటక, ఇ ంకో రోజు పశ్చిమ బెంగాల్‌ వెళ్లి ఫోటోకు ఫోజులు కొడుతారు. రాష్ట్ర ప్రజలను పట్టించుకోకుండా గాలికి వదిలి ఎవడో ప్రధాని మంత్రిని దింపేందుకు ఆరాటపడుతున్నారు. 
– ఎన్నికలకు ముందు నుంచి నాలుగేళ్ల పాటు బీజేపీతో కాపురం చేసిన చంద్రబాబు..అప్పుడు నరేంద్ర మోడీ వంటి నాయకుడు ప్రపంచంలో మరొకరు లేరట. మనరాష్ట్రానికి చేసినంతగా ఏ రాష్ట్రానికి చేయలేదని అసెంబ్లీ సాక్షిగా , ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ చెప్పాడు. నాలుగేళ్ల పాటు ఇద్దరు చిలుకాగోరింకా మాదిరిగా కాపురం చేశారు. వీరిని చూసి చిలుకా గోరింకలు కూడా సిగ్గు పడ్డాయి. చంద్రబాబు అన్ని విధాలుగా మోసం చేశారని ప్రజలు అనుకుంటున్న తరుణంలో ఆ నెపం వేరే వారికి అంటగట్టేందుకు కేంద్రంతో విడాకులు ఇస్తారు. 2014లో చంద్రబాబు ఏమన్నారు..కాంగ్రెస్‌ రాష్ట్రాన్ని విడగొట్టింది. సోనియా అవినీతి ఆనకొండ అన్నారు. ఈ రోజు అందాల కొండా, ఆనందాల కొండ అంటూ పొగుడుతున్నారు. ఆ రోజు సోనియా గాంధీ గాడ్సే..ఈ రోజు ఆమె దేవత అంటున్నాడు. ఆ రోజు రాహుల్‌ గాంధీ మొద్దబ్బాయి అన్నారు..ఈ రోజు రాహుల్‌ గాంధీని ఈ రోజు మేధావి అంటున్నారు. వీళ్ల పరిపాలన, రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయంటే..ఈ రోజు చంద్రబాబు పాలనే నిదర్శనం. అధికారం కోసం ఎవరితోనైనా కలిసిపోతారు. జూన్‌8, 2018లో కాంగ్రెస్‌ పార్టీ చంద్రబాబుపై ఒక బుక్‌ విడుదల చేశారు. అందులో నాలుగేల్ల చంద్రబాబు పరిపాలనపై చార్జిషిట్‌ అన్న బుక్‌ విడుదల చేశారు. ఇవాళ కాంగ్రెస్‌ నేతలు, చంద్రబాబు ఒకే వేధికపై నిలబడి తెలంగాణలో మాట్లాడుతున్నారు. చంద్రబాబుకు సిగ్గులేని తనం ఎంత అన్న పరిస్థితి వస్తోంది. ఆగస్టు 29వ తేదీ హరికృష్ణ చనిపోతే..చంద్రబాబు హరికృష్ణ వద్దకు వెళ్లి ఆయన బౌతికాయం పక్కనే కేసీఆర్‌ కొడుకు కేటీఆర్‌తో కలిసి పోటీ చేద్దామన్నారని కేటీఆర్‌ చెబుతున్నారు. కేటీఆర్‌ ఆ రోజు మన ఇద్దరం కలిసి పోటీ చేయడం ఉండదన్నారట. చంద్రబాబు ఏమాత్రం సిగ్గు లేకుండా అక్టోబర్‌లో కాంగ్రెస్‌తో డీల్‌ కుదుర్చుకుంటారు. కాంగ్రెస్‌కు సిగ్గులేదు కాబట్టి అవినీతి సొమ్ము కోసం చంద్రబాబుతో డీల్‌ కుదుర్చుకున్నారు. నవంబర్‌లో కాంగ్రెస్, టీడీపీలు సీట్లు సర్దుబాటు చేసుకున్నారు. టీఆర్‌ఎస్‌ ఒప్పుకుని ఉంటే కేసీఆర్‌ పక్కనే నిలబడి కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు చేసేవారు కాదా? చంద్రబాబు ఇప్పుడు ఏమంటున్నారు..చక్రం తిప్పడం అంట.
– చంద్రబాబు చావు తెలివి తేటలు, అబద్ధాలు మోసాలు నాలుగేళ్లు చూశాం. ఈ మధ్య కాలంలో చంద్రబాబు పార్టనర్‌ పవన్‌ కళ్యాణ్‌.. నాలుగేళ్లు చంద్రబాబుతో కలిసి కాపురం చేస్తారు. చంద్రబాబు చెప్పిన ప్రతి అబద్దంలోనూ, అవినీతిలో పవన్‌ భాగస్వామి కాదా? ఎన్నికలకు కేవలం నాలుగు నెలల ముందు ఏం చేస్తున్నారు. ఇవాళ చంద్రబాబుతో విడిపోయినట్లు మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేస్తున్నారు. చంద్రబాబు విలువలు లేని రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు స్క్రీప్ట్‌ రాస్తే..పవన్‌ యాక్సన్‌ చేస్తున్నారు.  అదే సినిమాకు నిర్మాత లింగమనేని..ఈ సినిమాలో ఇంట్రవెల్‌ ఎక్కువ, సినిమా తక్కువ. చంద్రబాబు అధర ్మంపై పోరాటం చేస్తున్నాం. అక్కడ కనిపించిన వ్యక్తి వైయస్‌ జగన్‌ ఒక్కరే.  పవన్‌ సినిమాకు బాబు డైరెక్షన్‌ చేస్తున్నారు. ఆయన పేవ్‌మెంట్‌ ఇ వ్వగానే పవన్‌ కాల్షీట్‌ ఇస్తారు. అయ్యా పవన్‌ కళ్యాణ్‌..జగన్‌ అవినీతి చేసేటప్పుడు నీవేమైనా చూశావా అని అడుగుతున్నాను. పవన్‌ కళ్యాణ్‌..నీవు రాజకీయాల్లోకి రాకముందు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనను చూశావా? పార్టీలకు, కులాలకు అతీతంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి చిరస్థాయిగా నిలిచిపోయారు. మహానేత చనిపోక ముందు వరకు జగన్‌ మంచి వ్యక్తి..ఎప్పుడైతే కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చానో అప్పుడు నాపై తప్పుడు కేసులు బనాయించారు. ఈ వ్యవస్థ మారకపోతే అందరం కూడా భ్రష్టుపట్టిపోతామని చెబుతున్నాను. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థ బాగుపడాలి. ఈ వ్యవస్థలోకి నిజాయితీ, విశ్వసనీయత అన్న పదాలకు అర్థం రావాలి. ఏదైనా నాయకుడు చెప్పింది చేయకపోతే తన పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లే పరిస్థితి తీసుకురావాలి. అప్పుడు ఈ చెడిపోయిన వ్యవస్థలోకి నిజాయితీ, విశ్వసనీయత వస్తుంది. 
– రేపు పొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం ఏం చేస్తామన్నది చెప్పేందుకు నవరత్నాలు ప్రకటించాం. ఆ నవరత్నాలతో ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే ధ్యేయం. ఈ రోజు ఈ మీటింగ్‌లో నవరత్నాలలో నుంచి పేదవాడి చదువుల కోసం ఏం చేస్తున్నామని చెప్పబోతున్నాను. నాన్నగారు పేదవారి కోసం ఒక అడుగు ముందుకు వేస్తే..జగన్‌ రెండు అడుగులు ముందుకు వేస్తాను. మనందరి ప్రభుత్వం వచ్చాక మీ పిల్లలను ఏం చదివిస్తారో చదివించండి..ఎన్ని లక్షలు ఖర్చైనా ప్రభుత్వమే భరిస్తుంది. మీ పిల్లలను ఏ బడికి పంపించిన ఆ తల్లి ఖాతాలో రూ.15 వేలు ప్రతి ఏడాది అందజేస్తాం. హాస్టల్‌లో ఉండి చదువుకునే వారికి ప్రతి ఏడాదికి రూ.20 వేలు ఇచ్చి తోడుగా ఉంటాం. ఈ చెడిపోయిన వ్యవస్థను మార్చేందుకు పాదయాత్రగా బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించమని, తోడుగా ఉండమని కోరుతూ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా...

జోగులన్నకు నా మససులో స్థానం ఉంటుంది
రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు గురించి ఈ మీటింగ్‌లో చెప్పాలి. మంత్రి కళా వెంకట్రావ్‌ ఇంటి పక్కనే కంబాల జోగుల ఇల్లు ఉంటుంది. ప్రతి రోజు జోగులు అన్న వద్దకు వచ్చి నీవు టీడీపీలోకి రావా అని ప్రలోభపెట్టారు. కానీ ఇటువంటి అన్యాయమైన రాజకీయాల్లో కూడా జోగులు అన్న తులసీ మొక్కగా నిలిచారు. ప్రలోభ పెట్టినా నిజాయితీ వైపు నిలబడ్డారు. జోగులన్నకు ఎప్పుడు నా మనసులో స్థానం ఉంటుంది. జోగులన్నను గొప్పగా ఆశీర్వదించమని కోరుతున్నాను. 


 
Back to Top