103వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్

ప్ర‌కాశం :  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేప‌ట్టిన‌ ప్రజాసంకల్పయాత్ర 103వ రోజు షెడ్యూల్‌ ఖరారు అయింది. ఈమేరకు పాదయాత్ర షెడ్యూల్‌ను వైయ‌స్‌ఆర్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం విడుదల చేశారు. ఆదివారం ఉదయం వైయ‌స్‌ జగన్ బ‌స చేసే ప్రాంతం  నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. తాళ్లూరు శివారు నుంచి రాజానగరం గిరిజన కాలనీ, కంకుపాడు, శ్రీరాంనగర్‌ కాలనీ, పార్వతీపురం క్రాస్‌, తిమ్మయ్యపాలెం మీదుగా అద్దంకి వరకు పాదయాత్ర కొనసాగిస్తారు.  

Back to Top