ముగిసిన 46వ రోజు ప్రజాసంకల్పయాత్ర

చిత్తూరు : వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 46వ రోజు చిత్తూరు జిల్లా వ‌సంత‌పురం వ‌ద్ద ముగిసింది. గురువారం ఉదయం చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలోనికి పాదయాత్ర ప్రవేశించింది. ఎద్దుల వారికోటలో పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం 9.30 గంటలకు ఎద్దుల వేమనగిరి పల్లి చేరుకొని పార్టీ ప్రవేశపెట్టిన నవరత్నాలను వైయ‌స్‌ జగన్ ప్రజలకు వివరించారు. ఆతరువాత పార్టీ జెండా ఎగరవేశారు. అక్కడ నుంచి ఆర్‌ఎన్‌ తాండా, కొట్టాల క్రాస్‌ రోడ్డు మీదుగా వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగింది. వసంతపురంలో పాదయాత్ర ముగించారు.  

Back to Top