శ్రీకాకుళంః వైయస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. 308వ రోజు పాదయాత్ర షెడ్యూల్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. బుధవారం ఉదయం పాలకొండలో బసచేసే ప్రాంతం నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడ నుంచి తామరాడ,తాంపేటపల్లి క్రాస్,ఎల్‌ఎల్‌పురం క్రాస్ వరుకు సాగుతోంది. మధ్యాహ్న భోజన విరామం అనంతరం పాదయాత్ర కొనసాగుతుంది. పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్ సెంటర్ సమీపంలో జరిగే భారీ బహిరంగ సభలో వైయస్ జగన్ ప్రసంగిస్తారని తలశీల రఘురాం వివరించారు.<br/>