274వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం విజయనగరం: రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలో అనంతవాహినిలా సాగిపోతోంది. ఆదివారం ఉదయం జననేత 274వ రోజు పాదయాత్రను గజపతినగరం నియోజకవర్గం జామి మండలంలోని నైట్‌ క్యాంప్‌ నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి బలరాంపురం, కుమరాన్‌, కోరుకొండ, చిన్నాపురం జంక్షన్‌, కొరాడపేట, చాకలిపేట, జొన్నవలస క్రాస్‌ మీదుగా నేటి ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. 

అడుగు ముందుకు పడనీయని అభిమానం, కాలు కదపనీయని అనురాగం. దారి పొడవునా మంగళహారతులు. ప్రజా సమస్యల తోరణాలు, వినతులు, విజ్ఞప్తులతో జననేత పాదయాత్ర మొదలైంది. నైట్‌క్యాంప్‌ వద్ద రాజన్న బిడ్డను చూడటానికి, మాట్లాడటానికి, పాదయాత్రలో తాము భాగం కావాలని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు ఉదయం నుంచే పెద్దఎత్తున తరలివచ్చారు.


Back to Top