కర్నూలు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పాదయాత్ర చేస్తున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ఆస్పరి మండలం కారుమంచి గ్రామంలో మహిళలు కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. అన్నా.. మేము రోజు వారి కూలీలం. ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి సాయం లేదు. పక్కా గృహాలు లేవు. కనీసం మరుగుదొడ్లు నిర్మించాలని కోరినా ఎవరూ పట్టించుకోవడం లేదు’ అని మహిళలు వాపోయారు. ‘వృద్ధులున్నా పింఛన్లు ఇస్తలేరు. ఇల్లు లేవు, పొదుపు రుణాల ఊసే లేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయమూ అందలేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం వైయస్ జగన్ మాట్లాడుతూ అధైర్యపడొద్దని వచ్చేది మన ప్రభుత్వమేనని, అప్పుడు అర్హులైన అందరికీ పింఛన్లు, గృహాలు, రుణాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.<br/><br/>