జాతీయ జెండాతో జననేతను కలిసిన నేతన్న

పశ్చిమగోదావరి జిల్లా: రెండు సంవత్సరాలుగా ఎంతో కష్టపడి మూడురంగుల మువ్వన్నెల జెండాను తయారు చేశానని అచంట వేమవరం గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన చేనేత కార్మికుడు రుద్రాక్ష సత్యనారాయణ జెండా తయారీ గురించి వివరించారు. చేసిన అతుకు, కుట్టు లేకుండా తాను తయారు చేసిన జాతీయ జెండా ఎ్రరకోట మీద ఎగరాలని కోరారు. రెండు సంవత్సరాలు కష్టపడి జెండాను తయారు చేసిన సత్యనారాయణను జననేత అభినందించారు. 


Back to Top