ఆదుకొని బతుకులు బాగు చేయన్నా..జననేతను కలిసి చేనేత కార్మికులు<br/><strong>విజయనగరం: </strong>నూలు ధరలు పెంచి ప్రభుత్వం తమ బతుకులను రోడ్డున పడేసిందని చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని కెల్లా గ్రామంలో చేనేత కార్మికులు కలిశారు. ఈ మేరకు తమ సమస్యలపై జననేతకు వినతిపత్రం అందజేశారు. ఎంత కష్టపడినా తమకు లాభం రావడం లేదని, నూలు ధరను చంద్రబాబు ప్రభుత్వం పెంచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో పెట్టె నూలు ధర రూ. 400 ఉండేదని, ఇప్పుడు రూ. 900 చేశారని వైయస్ జగన్‌కు వివరించారు. తమను ఆదుకోవాలని, బతుకులు బాగుచేయాలని జననేతను కోరారు. అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేతలను అన్ని విధాలుగా ఆదుకుంటానని హామీ ఇచ్చారు.