వ్యవసాయం వదిలి కూలీలుగా మారుతున్నాం

వ్యవసాయం వదిలి కూలీలుగా మారుతున్నాం
వైయస్‌ జగన్‌ను కలిసిన కృష్ణా రైతుల ఆవేదన 
విజయవాడ: విజయవాడ వైయస్‌ఆర్‌ కాలనీ నుంచి 137వ రోజు ప్రజా సంకల్పయాత్రను ప్రారంభించిన వైయస్‌ఆర్‌ సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అడుగడుగునా జనం నీరాజనాలు పలుకుతున్నారు. పాదయాత్రలో కృష్ణా జిల్లా రైతులు జననేతను కలుసుకొని వారి సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నిర్లక్ష్యం మూలంగా క్రాప్‌ హాలిడే ప్రకటించాల్సిన దుస్థితి నెలకొందని మండిపడ్డారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక నష్టాల పాలవుతున్నామన్నారు. వేల క్యూసెక్కుల నీరు వృథాగా పోతున్నా పట్టించుకోవడం లేదని, రైతాంగానికి మాత్రం నీరిచ్చేందుకు చంద్రబాబు మనస్సు ఒప్పుకోవడం లేదన్నారు. రైతులు వ్యవసాయం వదిలి వలస కూలీలుగా మారుతున్నారని, ఆదుకోవాలని కోరారు. అధికారంలోకి వచ్చిన తరువాత వ్యవసాయాన్ని పండుగలా చేస్తామన్నారు. 
Back to Top