కర్నూలు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఆస్పరి మండలంలో పాదయాత్ర చేస్తున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డిని యూటీఎఫ్ ఉపాధ్యాయులు కలిశారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని వైయస్‌జగన్ ప్రకటించడం పట్ల ఉపాధ్యాయులు ఫ్లకార్డులు పట్టుకొని జననేత వెంట కొంత దూరం నడిచి హర్షం వ్యక్తం చేశారు.