కర్నూలు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డిని గురువారం ఉపాధ్యాయ సంఘాల నాయకులు కలిశారు. యూటీఎఫ్ జిల్లా నాయకులు జననేతను కలిసి సీపీఎస్ విధానం రద్దు చేసేలా పోరాటం చేయాలన్నారు. మీరు ముఖ్యమంత్రి కాగానే సీపీఎస్ రద్దు చేయాలన్నారు. పాదయాత్ర మొదటి రోజే వైయస్ జగన్ సీపీఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చారని అందుకే పాదయాత్రకు మద్దతు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తానని వైయస్ జగన్ హామీ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.