<strong>శ్రీకాకుళం:</strong> దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి కులమతాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేశారని సీతారాంపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు రాజగోపాల్ అన్నారు. రాజగోపాల్ ప్రజా సంకల్పయాత్రలో పాల్గొని వైయస్ జగన్‌ను కలిశారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కార్యకర్తగా ఉన్న తనకు వైయస్‌ఆర్ హయాంలో ఆరోగ్యశ్రీ ద్వారా హార్ట్ సర్జరీ జరిగిందని జననేతకు చెప్పారు. అందుకు కృతజ్ఞతగా పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వచ్చానన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అర్హత ఉన్నా పెన్షన్ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. <br/>