సోంపేటను రక్షిత ప్రాంతంగా ప్రకటించాలి..

వైయస్‌ జగన్‌ను కలిసిన పర్యావరణ పరిరక్షణ సమితి సభ్యులు

శ్రీకాకుళంః ఎన్నో పోరాటాలు చేసి థర్మల్‌ ప్రాజెక్టును అడ్డుకుంటే..ఇప్పుడు అదే ప్రాంతంలో పరిశ్రమలు స్థాపించాలని ప్రభుత్వం చూస్తుందని సోంపేట పర్యావరణ పరిరక్షణ సమితి సభ్యులు ఆగ్రహం వ్యకం చేశారు.వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యను వివరించారు.జీవో నెంబర్‌ 329ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.గతంలో జీవో టీడీపీ ప్రభుత్వం రద్దు చేసిందని. కాని తర్వాత  మల్టీ ప్రొడక్ట్‌ ఇండ్రస్టియల్‌ జోన్‌గా డవలప్‌మెంట్‌ చేయాలని 329 జీవో విడుదల చేసిందన్నారు.ఈ జీవో రద్దు చేయాలని కోరారు.సోంపేట కాంప్లెక్స్‌ను రక్షిత ప్రాంతంగా ప్రకటించాలని చేయాలని గతంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన సంస్థ నివేదిక ఇచ్చిందన్నారు.పర్యావరణాన్ని కాపాడకోపోతే విపత్కర పరిస్థితులు ఎదుర్కొవలసి వస్తుందన్నారు.రక్షిత ప్రాంతంగా ప్రకటించాలని కోరారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top