ప్రభుత్వం మా సమస్యలు పట్టించుకోవడం లేదు

వైయస్‌ జగన్‌ను కలిసి గ్రామీణ పశు వైద్య ఉద్యోగులు
గుంటూరు: ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని గ్రామీణ పశు వైద్య శాఖ ఉద్యోగులు వైయస్‌ జగన్‌కు మొరపెట్టుకున్నారు. గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని పశు వైద్య ఉద్యోగులు కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారి సమస్యలను జననేతకు వివరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాలకు ఎన్నిసార్లు విన్నవించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో 1217 గ్రామీణ పశు వైద్య శాలలు నాన్‌ గ్రాడ్యూయేట్‌ ఉద్యోగులతో నడుస్తున్నాయన్నారు. రైతులకు అందుబాటులో ఉంటూ పశువులకు వైద్యం చేయిస్తున్నామన్నారు. 40 ఏళ్లుగా ఉన్న వైద్య సెంటర్లను అప్‌గ్రేడ్‌ చేయాలని ప్రభుత్వం చూస్తోందని, దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. 
Back to Top