ప్రారంభ‌మైన 125వ రోజు ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌


గుంటూరు:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షులు వైయ‌స్‌జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన పాద‌యాత్ర నేటికి 125వ రోజుకు చేరుకుంది. ఈ రోజు వైయ‌స్‌జ‌గ‌న్ స‌రిపూడి శివారు నుంచి త‌న పాద‌యాత్ర‌ను ప్రారంభించారు. అనంత‌రం అక్క‌డి నుంచి వెల‌వ‌ర్తిపాడు, మేడికొండూరు, గుండ్ల‌పాలెం క్రాస్ మీదుగా పేరిచెర్ల‌వ‌ర‌కు పాద‌యాత్ర చేయ‌నున్నారు. కాగా గుండ్ల‌పాలెం క్రాస్‌లో ప్ర‌జ‌ల‌తో మ‌మేకం కావ‌డంతో పాటు.. సాయంత్రం పేరిచెర్ల‌లో నిర్వ‌హించ‌నున్న బ‌హిరంగ స‌భ‌లో వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌నుద్ధేశించి ప్ర‌సంగించ‌నున్నారు. 
Back to Top