39వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్‌

 అనంతపురం: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర 39వ రోజు షెడ్యూల్‌ను వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. మంగళవారం ఉదయం 8 గంటలకు ధర్మవరం మండలం తనకంటివారిపల్లె నుంచి వైయస్‌ జగన్‌ పాదయాత్ర మొదలవుతుంది. అక్కడి నుంచి 8.30 గంటలకు పుట్టపర్తి నియోజకవర్గంలోని కృష్ణాపురం, 9 గంటలకు రామసాగరం క్రాస్, 9.30 గంటలకు యడలంకపల్లె క్రాస్, 10 గంటలకు మరల గ్రామానికి చేరుకుంటారు. 12 గంటలకు డీడీ కొట్టాల, 12.30 గంటలకు మధ్యాహ్న భోజన విరామం ఉంటుంది. 2.45 గంటలకు బుక్కపట్నం నుంచి పాదయాత్ర పునఃప్రారంభమవుతుంది. 3.15 గంటలకు మంగళ మడక క్రాస్, 4 గంటలకు ధర్మవరం నియోజకవర్గంలోని గరుగు తాండ, 4.30 గంటలకు పుట్టపర్తి నియోజకవర్గంలోని అగ్రహారం క్రాస్, 5 గంటలకు పాముదుర్తి వరకు పాదయాత్ర సాగుతుంది. సాయంత్రం 6 గంటలకు 39వ రోజు ప్రజా సంకల్ప యాత్ర ముగుస్తుంది.
 
Back to Top