<br/> అనంతపురం : ప్రజాసంకల్పయాత్ర 30వ రోజు అనంతపురం జిల్లా సింగనమల మండలం పాపినేనిపాలెం నుంచి ప్రారంభమైంది. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ఉదయం 8 గంటలకు పాదయాత్రను మొదలుపెట్టారు. అక్కడి నుంచి జంబులదిన్నె తండా, గార్లదిన్నె మీదుగా మర్తాడ్ వరకు యాత్ర కొనసాగనుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు గార్లదిన్నెలో భోజన విరామం ఉంటుంది. ఈ సందర్భంగా జంబులదిన్నె వద్ద వైయస్ జగన్ బీసీ సదస్సులో పాల్గొననున్నారు. చివరకు మార్తాడులో ప్రజాసంకల్పయాత్రను ముగిస్తారు.<br/><br/>