ప్రారంభమైన ప్రజా సంకల్పయాత్ర

ఇచ్చిన హామీలను
నెరవేర్చకుండా ప్రజా కంటక పాలన సాగిస్తున్న ప్రభుత్వ తీరును ఎండగడుతూ, ప్రజలకు కొండంత
అండగా తామున్నామంటూ జననేత  వైయస్ జగన్
మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర సోమవారం ఉదయం తిరిగి ప్రారంభమైంది. 17
రోజుల క్రితం విశాఖ విమానాశ్రయంలో ఆయనపై హత్యాయత్నం జరగడంతో తీవ్రంగా గాయపడి చికిత్స
తీసుకున్న సంగతి తెలిసిందే. అనివార్యమైన ఈ విరామం అనంతరం 295 రోజు నాటి పాదయాత్రను
జననేత విజయనగరం జిల్లా సాలూరూ నియోజకవర్గం పాయకపాడు నుంచి తిరిగి ప్రారంభించారు.

పాయకపాడు నుంచి మేలపువలస, మక్కువ క్రాస్ రోడ్డు‌, ములక్కాయవలస మీదుగా
కాశీపట్నం క్రాస్‌ రోడ్డు వరకు  అటునుంచి
పాపయ్యవలస మీదుగా కొయ్యనపేట వరకు పాదయాత్ర కొనసాగుతుంది.

Back to Top