శ్రీకాకుళంః సామంతులు కులస్తులు వైయస్ జగన్‌ను కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు.స్వాతంత్య్రం వచ్చినప్పుడు నుంచి ఓబీసీల్లో ఉన్న తమను వైయస్‌ఆర్ బీసీ(ఎ)లోకి మార్చారన్నారు.బీసీ కులంలోకి మారిన విద్య,ఆర్థికపరంగా వెనుకబడి ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు.తమ కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. ఎస్టీల్లోకి చేర్చాలని కోరారు.శ్రీకాకుళం జిల్లాలో సుమారు ఆరువేల సామంతుల కుటుంబాలు ఉన్నామన్నారు.30 వేల నుంచి 40వేల వరుకు జనాభా ఉన్నామన్నారు.పేదరికంలో ఉన్న సామంతులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు.పూటగడవని పరిస్థితుల్లో జీవనం గడుపుతున్నామని వాపోయారు.తమ సమస్యల పట్ల వైయస్ జగన్ సానుకూలంగా స్పందించారని తెలిపారు.