ప్రారంభ‌మైన 101వ రోజు ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌


ఒంగోలు: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన పాద‌యాత్ర నేటికి 101వ రోజు చేరుకుంది. ఈ రోజు వైయ‌స్ జ‌గ‌న్ చీమ‌కుర్తి నుంచి త‌న పాద‌యాత్ర‌ను ప్రారంభించారు. అక్క‌డి నుంచి  మంచికలపాడు, బండ్లముడి, తొర్రగుడిపాడు క్రాస్‌, పల్లామిల్లి మీదుగా గాడిపర్తివారిపాలెంకు పాద‌యాత్ర చేయ‌నున్నారు. రాత్రికి గాడిప‌ర్తివారిపాలెంలోనే బ‌స‌చేయ‌నున్నారు. కాగా జ‌నేన‌త వైయ‌స్ జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర‌కు విశేష స్పంద‌న వ‌స్తోంది. ప్ర‌కాశం జిల్లా ప్ర‌జ‌లు పాద‌యాత్ర‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. 

Back to Top