టీడీపీ పాలనలో మోడల్‌ స్కూళ్లు నిర్వీర్యం..


వైయస్‌ జగన్‌ను కలిసిన మోడల్‌ స్కూల్‌ అధ్యాపకులు..

శ్రీకాకుళంః కార్పొరేట్‌ స్కూళ్లకు ధీటుగా ఫలితాలు ఇస్తున్నా జీతాలు సరిగ్గా ఇవ్వడంలేదని    ప్రభుత్వం మోడల్‌ స్కూల్‌ అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు.  గ్రామీణ పేద విద్యార్థులకు ఆంగ్ల విద్యను అందించాలనే ఆశయంతో వైయస్‌ఆర్‌ మోడల్‌ను స్కూళ్లను ఏర్పాటు చేశారన్నారు. ఆంగ్లంలో విద్య అభ్యసిస్తే ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయనే ముందుచూపుతో వ్యవహరించారన్నారు. కార్పొరేట్‌ లాబీయింగ్‌ చేసి మోడల్‌ స్కూల్స్‌ను నిర్వీర్యం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. నాలుగు నెలలకోసారి జీతాలు ఇస్తున్నారని అధ్యాపకులు వాపోయారు.కనీస సదుపాయాలు కూడా కల్పించడం లేదన్నారు.
Back to Top