<strong>వైయస్ జగన్‌ను కలిసిన న్యాయవాదుల సంఘం</strong>శ్రీకాకుళంః చంద్రబాబు ప్రభుత్వంతో తమకు ఎటువంటి మేలు జరగలేదని న్యాయవాదుల సంఘం నేతలు వైయస్ జగన్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. తమకు ఇళ్లు మంజూరు చేయాలని, రుణాలు ఇప్పించాలని వినతించారు. కొత్తగా న్యాయవాద వృత్తిలోకి వచ్చినవారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని జూనియర్ న్యాయవాదులకు సై్టఫండ్ ఇవ్వాలని కోరారు.90 శాతం మంది న్యాయవాదలు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారన్నారు.ప్రభుత్వపరమైన ఎటువంటి ప్రయోజనాలు పొందక సతమతమవుతున్నారన్నారు.కనీసం ఇళ్లు కట్టుకుందామంటే బ్యాంకులు రుణాలు కూడా ఇవ్వడంలేదన్నారు. న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేయాలని జననేతకు విజ్ఞప్తి చేశారు.