<strong>విజయనగరంః</strong> అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని వైయస్ జగన్ హామీ ఇచ్చారని అగ్రిగోల్డ్ బాధితులు తెలిపారు. విజయనగరం జిల్లా కోరుకొండలో ప్రజా సంకల్పయాత్రలో వైయస్ జగన్‌ను అగ్రిగోల్డ్ బాధితులు కలిసి తమ పోరాటానికి బాసటగా నివాలని వైయస్ జగన్‌కు విజ్ఞప్తి చేశారు.మూడున్నర సంవత్సరాలుగా ఈ చేతగాని ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమవుతుందని విమర్శించారు. టీడీపీ నాయకులు రాబంధుల్లా అగ్రిగోల్డ్ ఆస్తులపై కన్నేశారన్నారు. వైయస్ జగన్ సానుకూలంగా స్పందించి బాధితులకు బాసటగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.అలాగే విజయనగరం బహిరంగ సభలో కూడా అగ్రిగోల్డ్‌పై ప్రస్తావించనున్నట్లు తెలిపారని బాధితులు తెలిపారు. వైయస్ జగన్ సీఎం అయితే మా అగ్రిగోల్డు బాధితులకు తప్పక న్యాయం జరుగుతుందనే విశ్వాసంతో ఉన్నామన్నారు.మాకు అండగా ఉంటానంటూ జననేత కొండంత భరోసా ఇచ్చి మాలో ధైర్యం నింపారని బాధితులు తెలిపారు.