విజయనగరంః విజయనగరం నియోజకవర్గం జీఎంవలస మండలం తూర్పుముఠా గ్రామానికి గిరిజనులు వైయస్ జగన్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. సమస్యలతో కూడిన వినతిప్రతాన్ని సమర్పించారు. వైయస్‌ఆర్ హయాంలో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేశారని తర్వాత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో తరలిపోయే దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులకు అటవీ భూముల హక్కుల చట్టాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. గిరిజన విద్యార్థులు చదవినా ఉపాధి అవకాశాలు లేవంటూ ఆవేదన వ్యక్తం చేశారు.ఏళ్ల తరబడి అభివృద్ధికి దూరంగా ఉన్న విజయనగరం జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన ఆంధ్ర,ఒడిస్సా సరిహద్దుల్లో వైయస్‌ఆర్ చేసిన అభివృద్ధిని టీడీపీ ప్రభుత్వం విచ్ఛినం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దివంగత మహానేత వైయస్‌ఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప టీడీపీ హయాంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు.ఉద్యోగావకాశాలు కూడా కల్పించడం లేదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.