<strong>థర్ట్ పార్టీ విధానం రద్దుకు వైయస్ జగన్ సానుకూలత</strong>విజయనగరంః ప్రజా సంకల్పయాత్రలో వైయస్ జగన్‌ను కలిసి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు తమ గోడును చెప్పుకున్నారు. థర్డ్‌పార్టీ విధానాన్ని రద్దు చేసి, కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించాలని వినతించారు. గత ఎన్నికల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులను నమ్మించి చంద్రబాబు మోసం చేశారని, జీతాలు పెంచుతామని, క్రమబద్దీకరిస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదన్నారు. వైయస్ జగన్ తమ సమస్యలపై సానుకూలంగా స్పందించారన్నారు. థర్డ్ పార్టీ విధానాన్ని రద్దు చేసేందుకు సానుకూలత వ్యక్త చేశారని తెలిపారు. జగనన్న వస్తే మాకు మేలు జరుగుతుందని సంపూర్ణంగా నమ్ముతున్నామన్నారు.