బాబు హామీలు.. నీటి మీద రాతలు..


విజయనగరంః ప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ జగన్‌ను కలిసి  డీఎడ్‌ విద్యార్థులు తమ సమస్యలు చెప్పుకున్నారు.ఏడాదికోసారి డీఎస్సీ పోస్టులు భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు.చంద్రబాబు జాబు వస్తుందని చెప్పి ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. యువతకు చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ నీటి మీద రాతలే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని, స్కాలర్‌షిప్పులు మంజూరు చేయాలని వైయస్‌ జగన్‌ను కోరినట్లు విద్యార్థినులు తెలిపారు.ప్రైవేట్‌ పాఠశాలలో ప్రైమరి విభాగాలకు కూడా డీఎడ్‌ చేసినవారినే తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

Back to Top