వైయస్‌ జగన్‌ను కలిసిన యాదవ సంఘం నేతలు

శ్రీకాకుళం: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని యాదవ సంఘం నాయకులు కలిశారు. తమను బీసీ (డీ) కేటగిరి నుంచి బీసీ(ఏ) కేటగిరిలో చేర్చడంతో పాటు తమ అభ్యున్నతికి కృషి చేయాలని కోరుతూ వైయస్‌ జగన్‌కు వినతిపత్రం అందజేశారు.  అలాగే జననేత వైయస్‌ జగన్‌ను జీడిపిక్కల పల్పింగ్‌ కేంద్రం కార్మికులు కలిశారు. దీంతో రేషన్‌ సరుకులు ఇవ్వడం లేదని వైయస్‌ జగన్‌కు జీడి కార్మికులు ఫిర్యాదు చేశారు.

జననేతతో జీడిపిక్కల పల్పింగ్‌ కేంద్రం నిర్వాహకులు తమ సమస్యలు చెప్పుకున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సబ్సిడీ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూలీ రేట్లు పెంచలేకపోతున్నామని నిర్వాహకులు జగన్‌కు వివరించారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే 45 ఏళ్లు నిండిన వారికి పింఛన్‌ ఇస్తామని, తద్వారా నాలుగు విడతల్లో ప్రతి ఒక్కరికి రూ.75 వేలు అందించి అందరి సమస్యలు పరిష్కరిస్తామని వైయస్‌ జగన్‌హామీ ఇచ్చారు.
 

తాజా వీడియోలు

Back to Top