సీపీఎస్‌ రద్దు కై విజ్ఞప్తి

వైయస్‌ జగన్‌ను కలిసిన ప్రభుత్వ ఉద్యోగులు

శ్రీకాకుళం: సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ జగన్ను ప్రభుత్వ ఉద్యోగులు కలిశారు. తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో సీపీఎస్‌ను రద్దు చేస్తామంటూ టీటీడీపీ మేనిఫెస్టోలో పెట్టారని, సీపీఎస్‌ రద్దుపై వేసిన కమిటీ వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే సీపీఎస్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. 
Back to Top