మీరంతా తోడుగా ఉంటే జయిస్తా

లంచం.. లంచం.. బాబు పాలనంతా లంచం

పెన్షన్, రేషన్, ఆఖరికి మరుగుదొడ్లకూ లంచమే

బినామీల కోసం విద్యారంగాన్ని నాశనం చేశారు

బాబు దగ్గరుండి 6 వేల స్కూళ్లను మూతవేయించాడు

జన్మభూమి కమిటీల పేరుతో గ్రామాల్లో మాఫియా

బకాయిలు చెల్లించలేక ఆరోగ్యశ్రీని అటకెక్కించారు

ఉద్దానం బాధితులను ఆదుకునే ఆలోచన లేకుండా బాబు పాలన

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

 

శ్రీకాకుళం:
మీరంతా తోడుగా ఉంటే నారాసురుడు చంద్ర‌బాబును, ఎల్లోమీడియాను జ‌యిస్తాన‌ని, అవినీతి పాల‌న‌ను అంతం చేస్తాన‌ని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పిలుపునిచ్చారు.రాష్ట్రంలోని ఇచ్ఛాపురం నియోజకవర్గ పరిధిలోని కవిటి మండలంలోని చెల్లెమ్మలు కలిశారు. అక్కడ జూనియర్‌ కాలేజీలు 450కి పైగా విద్యార్థులు చదువుతున్నారు. అన్నా జూనియర్‌ కాలేజీలో 450 మంది విద్యార్థులం ఉన్నాం.. అందులో 240 మంది ఆడపిల్లలే ఉన్నారన్నా.. కాలేజీల్లో మరుగుదొడ్లు లేవన్నా అని చెప్పారు. చంద్రబాబు టీవీల్లో ఇస్తున్న స్టేట్‌మెంట్లు గుర్తున్నాయా..? మన రాష్ట్రంలో ఎవరూ మలమూత్రాలకు బయటకుపోరు ఓపెన్‌ డిఫకేషన్‌ ఫ్రీ కార్యక్రమంలో మన రాష్ట్రంలో నంబర్‌ వన్‌లో ఉందని అబద్ధాలు చెబుతున్నారు. ఇంతటి దారుణంగా పచ్చి అబద్ధాలు చెప్పేందుకు చంద్రబాబు సిగ్గుపడాలి. చెల్లెమ్మలు మరుగుదొడ్లకు పోలేని పరిస్థితుల్లో పాలన చేస్తున్నాడంటే ఇంతకంటే సిగ్గుమాలిన ముఖ్యమంత్రి దేశ చరిత్రలో ఎవరూ ఉండరు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న స్కూళ్లు, కాలేజీలు అనేక ఉన్నాయి.

 

విద్యారంగాన్ని నాశనం చేశారు. 

చంద్రబాబు తన బినామీల కోసం విద్యారంగాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నాడు. ఇదే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత 6 వేల స్కూళ్లను దగ్గరుండి మూతవేయించారు. స్కూళ్లు ఒక్కటే కాదు. ఎస్సీలు, బీసీల వసతి గృహాలు మూసివేయించారు. ఇవాళ ఆ పేద విద్యార్థులు ఎంత అన్యాయానికి గురవుతున్నారో లెక్క చేయని పరిస్థితిలోకి వెళ్లాడు. ఆ స్కూళ్లకు సంబంధించి చంద్రబాబు పాలనలో ఇవాల్టికి కూడా చాలా మంది పిల్లలు వచ్చి చాలా సబ్జెక్టులకు సంబంధించిన పుస్తకాలు ఇవ్వలేదని చెబుతున్నారు. జూన్, జూలైలో జరగాల్సిన పుస్తకాల పంపిణీ ఇవాల్టికి పంపిణీ చేయని పరిస్థితి నెలకొంది. యూనిఫాంల పరిస్థితి కూడా నాసిరకంగా ఉంది. 

ఉపాధ్యాయుల భర్తీ ఎక్కడ?

స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉద్యోగాలు 23 వేల ఖాళీగా ఉంటే వాటిని భర్తీ చేయకుండా పాఠశాలలను నాశనం చేయడానికి పూనుకున్నాడు. గవర్నమెంట్‌ స్కూళ్లు వద్దూ అనే విధంగా దిగజార్చడానికి నడుం బిగించాడు. ప్రభుత్వ పాఠశాలలకు వెళ్తే మధ్యాహ్న భోజనం కార్మికులకు సరుకుల బిల్లలు ఆరు నెలలకు పైగా బకాయి పడ్డాడు. అలాంటి పరిస్థితుల్లో మధ్యాహ్న భోజనం పథకం సరిగ్గా పనిచేయక, పిల్లలు సరిగ్గా తినకూడదు. గవర్నమెంట్‌ స్కూళ్లకు పిల్లలు పోవద్దని, ప్రైవేట్‌ స్కూళ్లకు వెళ్లేలా చేయాలని, తన బినామీలైన నారాయణ, చైతన్య స్కూళ్లకు వేలకు వేలు దోచుకునేందుకు దోహదపడాలని చంద్రబాబు పన్నుతున్న జిత్తులు కనిపిస్తాయి.

ఇంజనీరింగ్‌ ఫీజుకు విద్యార్థి బలి..

చంద్రబాబు హయాంలో ఒక్క అడుగు ముందుకు వేస్తే నెల్లూరు జిల్లాలో ఉదయగిరి నియోజకవర్గం కనిగిరి మండలంలో పాదయాత్ర చేస్తుండగా కృష్ణారెడ్డిపాలెం వద్ద రోడ్డు పక్కనే చిన్న గుడిసె, దాని ఎదురుగా ఒక ఫ్లెక్సీ. ఆ ఫ్లెక్సీలోని చిన్న పిల్లాడికి పూలదండ వేసి ఉంది. తల్లిదండ్రులు ఇద్దరూ నా దగ్గరకు వచ్చారు. ఆ తండ్రి పేరు గోపాల్‌ నా దగ్గరకు వచ్చి అన్నా.. ఆ ఫొటోలో ఉన్న వ్యక్తి నా కుమారుడు అని చెప్పాడు. నా కొడుకు మంచి స్టూడెంట్‌ అన్నా.. ఇంజినీరింగ్‌లో సీటు వచ్చింది. కానీ ఫీజులు చూస్తే లక్షల రూపాయలకు పైగా ఉందన్నా అని చెప్పారు. ప్రభుత్వం ఇస్తున్న రీయంబర్స్‌మెంట్‌ ఎంత అంటే రూ. 30 వేలు అని చెప్పాడు. అన్నా.. నా కొడుకు రూ. 30 వేల వస్తున్న పరిస్థితుల్లో ఎలా చదివిస్తావని అడిగాడన్నా.. రూ. 70 వేలు అప్పు చేసి ఎలాగోలా చదివించానన్నా.. అప్పు పరిస్థితి తెలిసి నా కుమారుడు బాధపడ్డాడన్నా అని చెప్పాడు. రెండో సంవత్సరం నా కుమారుడు మళ్లీ ఇంటికి వచ్చి ఈ సంవత్సరం ఏం చేస్తావు నాన్న అని అడిగాడన్నా.. ఏదో ఒకటి చేస్తా నువ్వు చదువుకొని గొప్పవాడివి కావాలన్నా అని చెప్పానని వివరించాడు. తన చదువుల కోసం ఆ కుటుంబం అప్పుల పాలయ్యే పరిస్థితి చూడలేక.. నా కుమారుడు నేరుగా హాస్టల్‌కు వెళ్లి ఆ హాస్టల్‌లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పిన దీనగాథ ఎప్పటికీ మరిచిపోలేను. రాష్ట్రంలో గోపాల్‌ అన్న లాంటి పరిస్థితుల్లో అనేక మంది తల్లిదండ్రులు ఉన్నారు. ఇంజినీరింగ్, డిగ్రీ, డాక్టర్, పీజీ చదువుతున్న పిల్లలు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సరిపోక తల్లిదండ్రులు ఇళ్లులు, ఆస్తులు అమ్ముకోవడం, నిరుపేదలు ఏమీ చేయలేక పిల్లలను చదువు మానిపించే పరిస్థితి ఏర్పడింది. బాబు పాలనపై ఆ తల్లిదండ్రులను అడిగితే.. నిన్ను నమ్మం బాబూ అని ప్రతి నోటి నుంచి వస్తుంది.

డయాలసిస్‌ రోగులు బతకాలా..? చావాలనా?

ఇక పేదవాడికి మరో కారణం ఏదైనా ఉందంటే.. అనుకోకుండా ఏదైనా పెద్ద రోగం వస్తే ఆ పేదవాడు తల్లడిల్లే పరిస్థితి. పెద్ద ఆస్పత్రులకు వెళ్తే తప్ప నయం కాని రోగం. ఆస్పత్రుల పరిస్థితులు ఎలా ఉన్నాయంటే.. ఆరోగ్యశ్రీలో పూర్తిగా నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు దాదాపు 8 నెలలుగా బకాయిలు చెల్లించకపోవడంతో సేవలను నిలిపివేసిన దుస్థితి కనిపిస్తుంది. ఇచ్ఛాపురం నియోజకవర్గం నుంచి ప్రతి రోజు ఇద్దరు ముగ్గురు వచ్చి అన్నా మా పరిస్థితి దయనీయంగా ఉందని చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం పరిస్థితి చూస్తే గుండె తరక్కుపోతుంది. 4 వేలకుపైగా డయాలసిస్‌ చేయించుకుంటున్నారు. అందులో కేవలం 14 వందల మందికి మాత్రమే ఉచితంగా డయాలసిస్‌ అందుతుంది. మిగిలిన వారంతా ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో అప్పులు చేసి మరీ వైద్యం చేయించుకుంటున్నారు. పెన్షన్‌ కేవలం 370 మందికి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటున్న అన్యాయమైన పాలన కనిపిస్తుంది. ఆ పెన్షన్‌ కూడా ముష్టివేసినట్లు రూ. 2500 ఇస్తున్నారు. ఆ డయాలసిస్‌ రోగులు బతకాలా.. చావాలనా..? ఆరోగ్యశ్రీ ఈ రాష్ట్రంలో ఉందా..? లేదా..? చంద్రబాబూ. 

ఆందోళనలో ఆరోగ్యశ్రీ పథకం

ఆరోగ్యశ్రీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే 108కి ఫోన్‌ చేస్తే 20 నిమిషాల్లో రావాల్సిన అంబులెన్స్‌ వస్తుందో రాదో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. విజయనగరం జిల్లాలోని కొన్ని సంఘటనలు ఎప్పటికీ మరిచిపోలేను. గరివిడి మండలం కోడూరుకు చెందిన ఇంటర్మీడియట్‌ పాప భవానీ నా దగ్గరకు వచ్చి సమస్య చెప్పింది. అన్నా.. మా ఇంటి పక్కన గౌరి అని ఒక గర్భిణి ఉందన్నా.. ఆవిడకు పురిటి నొప్పుల బాధపడుతుంటే 108కి ఫోన్‌ చేస్తే టైర్‌ పంశ్చర్‌ అయింది రాలేమని చెప్పారన్నా అని చెప్పింది. స్కూల్‌ నుంచి పిల్లలతో వస్తున్న ఆటోలో అతికష్టం మీద గౌరిని తీసుకెళ్లి ప్రసవం చేయించాల్సిన పరిస్థితి వచ్చిందన్నా అని ఆ పాప ఆవేదన వ్యక్తం చేసింది. అదే విధంగా గజపతినగరం నియోజకవర్గంలో జరిగిన ఇంకో ఘటన గర్భిణి మహిళ 108 అందుబాటులోకి రాకపోవడంతో ఆవిడ బస్సులో రావాల్సి వచ్చి నొప్పులు భరించలేక మెంటాడ రోడ్డుపైనే ప్రసవించింది. విశాఖ జిల్లా కే.కోటపాడులో సకాలంలో 108 వెళ్లకపోవడంతో ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇవాళ ఆరోగ్యశ్రీ ఎంత దారుణంగా ఉందంటే మన పిల్లలకు మూగ, చెవుడు వస్తే ఆపరేషన్‌ ప్రభుత్వం చేయిస్తుందనే నమ్మకం లేదు. మెదడుకు సంబంధించిన పెద్ద రోగం వస్తే వైద్యం చేయించుకోవడానికి పెద్ద ఆస్పత్రికి వెళ్లాలి. హైదరాబాద్‌లో వైద్యం చేయించుకుంటే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తారనే లేని నమ్మకం చంద్రబాబు కల్పిస్తున్నాడు. ఇలాంటి అన్యాయమైన పాలన రాష్ట్రంలో జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో గ్రామాల్లో వైద్యం కోసం ఎదురు చూస్తున్న పేదవాడిని అడిగితే వారి నోటి నుంచి వచ్చే మాట నిన్ను నమ్మం బాబూ అంటున్నారు. 

గ్రామ స్వరాజ్యం అటకెక్కింది

గ్రామాల్లో గ్రామ స్వరాజ్యం కనిపించడం లేదు. జన్మభూమి కమిటీల పేరుతో మాఫియాలు కనిపిస్తున్నాయి. రేషన్‌ కార్డు కావాలన్నా.. లంచం, పెన్షన్‌ పంపిణీకి లంచం, ఇల్లు కావాలన్నా లంచం, చివరకు మరుగుదొడ్లు కావాలన్నా లంచం ఇవ్వాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. చంద్రబాబు పాలనలో ఇవాళ అతి భయానక పరిస్థితులు గ్రామాల్లో కనిపిస్తున్నాయి. పెన్షన్‌ కావాలని అడిగితే జన్మభూమి కమిటీలు వేసే ప్రశ్న.. ఏ పార్టీ వారని అడుగుతున్నారు. ఇదే శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు పొందూరులో జరగిన ఘటన గురించి అవ్వా, తాతలు చెప్పారు. పొందూరులో పెన్షన్లు రాక, జన్మభూమి కమిటీల అరాచకాలు భరించలేక చివరకు కోర్టుకు వెళ్లిన పరిస్థితులు చూశా. కోర్టులో జడ్జి గారి దగ్గర నిలబడి సార్‌ నేనే బతికే ఉన్నాను.. నాకు పెన్షన్‌ అందడం లేదని అవ్వాతాతలు చెప్పిన మాట. ఆ హైకోర్టు అక్షింతలు వేస్తూ పెన్షన్‌ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినా.. ఇప్పటికీ చాలా మందికి పెన్షన్‌ దొరకని పరిస్థితి నెలకొంది. జన్మభూమి కమిటీ మాఫియా నడుపుతున్న ప్రభుత్వ పాలన చూసి గ్రామాల్లోనే ఏ నిరుపేదను అడిగినా.. బాబు పాలన మీద మీరు ఏమనుకుంటున్నారంటే నిన్ను నమ్మం బాబూ అంటున్నారు. 

పైన చంద్రబాబు, కింద జన్మభూమి కమిటీల దోపిడీ

పాలన చూస్తే పైన చంద్రబాబు కింద జన్మభూమి కమిటీలు. పైన ఉన్న చంద్రబాబు ఇసుక, మట్టి, బొగ్గు, కరెంటు కొనుగోలు, కాంట్రాక్టర్లు, మద్యం, రాజధాని, విశాఖ భూములు, గుడి భూములు, దళితుల భూములు వదలకుండా రాష్ట్రాన్ని భోజనం చేస్తున్నాడు. చివరకు చంద్రబాబు చేస్తున్న అన్యాయపాలనను ఎత్తి చూపుతుంటే భయం పట్టుకుంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది టెంప్రేచర్‌ పెరుగుతోంది. ఈ మధ్య కాలంలో మీరంతా గమనించే ఉంటారు. బాబు నోటి నుంచి ఏదైనా మాట వస్తే ఆ మాటకు మెదడుకు కనెక్షన్‌ తప్పిందని గమనించే ఉంటారు. ఎన్నికలు దగ్గరకు వచ్చే కొద్ది చంద్రబాబులో భయం ఎక్కువవుతోంది. పేదలకు కొత్త ఇళ్లు, కొత్త రేషన్‌ కార్డులు, కొత్త పెన్షన్లు, అంతటితో ఆగకుండా కొత్త కొత్త స్కీమ్‌లు పెట్టి ఎన్నికలకు ఆరు నెలల ముందు చంద్రబాబు డ్రామాలు అని కొత్త సినిమా తీస్తున్నాడు. ఏ పని చేసినా ఎన్నికలకు కేవలం ఆరు నెలల ముందు చేశానంటే చేశాను అనే కార్యక్రమం. ఐద్లేళ్లుగా అవన్నీ వచ్చినట్లుగా భావించాలని నానా అగచాట్లు పడుతున్నాడు. ఇటువంటి మోసాలు ప్రజలంతా చూస్తున్నప్పుడు వారి నోటి నుంచి వచ్చే మాట నిన్ను నమ్మం బాబూ అనే మాటలు వినిపిస్తున్నాయి. 

ప్రజాస్వామ్యం ఖూనీ

ప్రజా స్వామ్యాన్ని చంద్రబాబు పట్టపగలే ఖూనీ చేస్తున్నాడు. 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లు కొనుగోలు చేశాడు. వారిలో నలుగురిని మంత్రులను చేసిన పరిస్థితి. చంద్రబాబు పాలనను చూడండి. ఇటువంటి పాలన కావాలా.. ఇటువంటి మనిషి కావాలా..? నాలుగున్నర సంవత్సర కాలం మోసం చేస్తున్నాడు. ఎన్నికలు వచ్చే సరికి డ్రామాలు ఆడుతున్నాడు. ఏ స్థాయిలో ఆడుతున్నాడో ప్రజలంతా గమనించాలి. ఎమ్మెల్యేలను రూ. 20, 30 కోట్లు ఇచ్చి కొనుగోలు చేస్తాడు. పక్కన తెలంగాణకు వెళ్లి ఎన్నికల సమయంలో అమ్ముడుపోయే ఎమ్మెల్యేలకు ఓట్లు వేయొద్దు అని పిలుపునిస్తాడు. ఎన్నికలు వచ్చే సరికి ఊసరవెల్లికంటే ఎక్కువగా రంగులు మార్చుతాడు. 

ఎన్నికలకు ఆరునెలలు ముందు చంద్రబాబు డ్రామాలు అనే కొత్త సినిమాలు తీస్తున్నారు. చంద్రబాబు మోసాలు ప్రజలు చూస్తున్నారు. ప్రజలంతా నిన్ను నమ్మంబాబు అంటున్నారు. చంద్రబాబు పాలనలో ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేశారు. 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లు కొన్నారు. అందులో కొందరిని మంత్రలను కూడా చేశారు. చంద్రబాబు పాలనను ఒకసారి చూడండి ఇటువంటి పాలనా కావాలా అని అడుగుతున్నా.. ఇదే పెద్ద మనిషి నాలుగున్నర సంవత్సరాల కాలం ఎన్నికల వచ్చే సరికి డ్రామాలు ఆడతారు. ప్రజలు గమనించాలి. చంద్రబాబు ఆంధ్రరాష్ట్రంలో  ఎమ్మెల్యేలను కొంటాడు. ఇదే పెద్దమనిషి పక్క రాష్ట్రం తెలంగాణకు వెళ్తాడు అక్కడ అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలకు ఓట్లు వేయయద్దు అని చంద్రబాబు పిలుపునిస్తాడు. ఎన్నికల వచ్చేసరికి ఊసరివెల్లిగా వేగంగా మారిపోతాడు.నాలుగున్నరేళ్లుగా  ప్రత్యేకహోదాను ఖూనీ చేశాడు.

నాలుగు సంవత్సరాలు బీజేపీతో కాపురం చేస్తాడు.  నాలుగు సంవత్సరాల్లో  బీజేపీని పోగుడుతాడు. తీర్మానాలు చేసి బీజేపీ ప్రత్యేకహోదా ఇవ్వకపోయినా ప్రత్యేకహోదాపై చంద్రబాబు వెటకారం చేసి మాట్లాడతాడు. ప్రత్యేకహోదా పేరు చెప్పితే జైల్లో పెట్టిస్తానంటాడు. ప్రత్యేకహోదా సంజీవనా అని అడుగుతాడు. బీజేపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి చేసినట్లుగా ఏ ప్రభుత్వం చేయలేదంటాడు.అసెంబ్లీ తీర్మానాలు పెట్టి నరేంద్రమోదీని పోగుడుతాడు.బీజేపీవాళ్లు కూడా చంద్రబాబు పోగుడుతారు. నాలుగు సంవత్సరాలుగా మనం చూసిన సినిమా చిలకా గోరింక కూడా సిగ్గుతో తలదించుకునే విధంగా జరిగింది. కాని ఇదే పెద్దమనిషి ఎన్నికల వచ్చేసరికి డ్రామాలు మొదలుపెడతాడు. ప్రత్యేకహోదా కోసం తానే పోరాటాలు  చేస్తున్నాడంట, ధర్మపోరాటాలు చేస్తున్నాను అంటా ఈ పెద్దమనిషి. ఒకసారి ఆలోచన చేయమని అని అడుగుతున్నా రాష్ట్రంలో దుష్టపాలన సాగుతుంది.చంద్రబాబుకు అనుకూలమైన రెండు పత్రికలు,అనేక టీవీ ఛానెళ్లను అడ్టుపెట్టుకుని రాష్ట్ర ప్రజలకు ఏమి చేయకపోయినా చేసినట్లుగా రాష్ట్రంలో గ్లోబెల్‌ ప్రచారం జరుగుతుందన్నారు.

కుల, మత, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు
నాలుగేళ్లు చిలుకా గోరింకల మాదిరిగా కాపురం చేసిన చంద్రబాబు, బీజేపీలు ఇప్పుడు కపట నాటకాలు ఆడుతున్నాయి. చంద్రబాబు బీజేపీతో విడాకులు తీసున్నారు. ఇప్పుడు మోడీతో యుద్ధమని చెబుతున్నారు. ఈ చెడిపోయిన వ్యవస్థలో మార్పు రావాలి. ఏదైనా హామీ ఇచ్చి నేరవేర్చకపోతే ఆ నాయకుడు పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లాలి. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థను మార్చాలంటే జగన్‌ ఒక్కరితో సాధ్యం కాదని, జగన్‌కు మీ అందరి తోడు కావాలి. మీ అందరి దీవేనలు కావాలి. అప్పుడే ఈ వ్యవస్థలోకి నిజాయితీ, విశ్వసనీయ అన్న పదాలకు అర్థం వస్తుంది. 

మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక..

ఇటువంటి అన్యాయమైన పాలన పోయి మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం ఏం చేస్తామన్నది ఇప్పటికే నవరత్నాలు ప్రకటించాం. అర్హులైన ప్రతి పేదవాడికి మంచి చేసేందుకు ప్రభుత్వం తపన పడాలి. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చే దిశగా అడుగులు వేస్తూ మొదట జిల్లా స్థాయిలో మార్పు తెస్తూ ప్రతి పార్లమెంట్‌ను ఒక జిల్లాగా చేస్తాను. దానికి కారణం ప్రతి కలెక్టర్‌ ఏడు అసెంబ్లీ సెగ్నెంట్లకు జవాదుదారిగా ఉంటారు. ప్రజల్లోకి పథకాలు వెళ్లాలంటే కలెక్టర్లకు చేతినిండా పని పెడతాం. కలెక్టర్‌ వ్యవస్థను పూర్తిగా ప్రజలకు దగ్గరగా చేరుస్తాను. 

మీ గ్రామంలోనే పది మందికి ఉద్యోగాలు
ప్రతి పేదవాడికి న్యాయం చేసే దిశగా ఆలోచన చేస్తూ ప్రతి గ్రామంలోనూ గ్రామ సెక్రటేరియట్‌ తీసుకువస్తానని హామీ ఇస్తున్నాను.  మీ గ్రామంలో చదువుకున్న ప ఇల్లకు అక్కడే పది మందికి ఉద్యోగాలు ఇస్తామని చెబుతున్నాను. ఇవాళ పింఛన్‌ కావలాలన్నా లంచం ఇవ్వాల్సిందే. మరుగుదొడ్డి కావాలన్నా లంచాలు అడుగుతున్నారు. పేదవాడికి ఏ అవసరం ఉన్నా కూడా, ఏ పథకం కావాలన్నా..నవరత్నాలు కావాలన్నా గ్రామ సెక్రటెరియట్‌ ద్వారా అందజేస్తాం. ఇచ్చే సమయంలో అర్హతలు మాత్రమే చూస్తామని, కులాలు, మతాలు, రాజకీయాలు చూడమని చెబుతున్నాను. ప్రతి పథకం ఇంటికే వెళ్లే దిశగా అడుగులు వేస్తూ ప్రతి గ్రామంలోనూ 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్‌ను ఏర్పాటు చేస్తాం. సేవా దృక్పథం ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాం. వారికి రూ.5000 జీతం ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ప్రతి పథకంతో పాటు మన ఇంటికే రేషన్‌ బియ్యం వచ్చేలా ఏర్పాటు చేస్తామని చెబుతున్నాను. గ్రామ వాలంటీర్‌ 50 ఇళ్లకు జవాబుదారిగా ఉంటాడు. పథకాల కోసం ఎవరి చుట్టూ తిరుగకుండా, ఎవరికి లంచాలు ఇవ్వకుండానే నేరుగా సంక్షేమ పథకాలు మీ ఇంటికే వచ్చేలా చేస్తాం.

ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూసేందుకే నవరత్నాలు
ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వులు చూసేందుకు నవరత్నాలు ప్రకటించాను. ఇందులో నవరత్నాల గురించి చెబుతున్నాను. 
1. ప్రతి రైతు ముఖంలో చిరునవ్వులు ఎలా చూడాలో ఈ సభలో చెబుతున్నాను. రైతులు బతుకులు ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతున్నాను. రైతులకు గిట్టుబాటు ధరలు లేవు. వడ్డీలు విఫరీతంగా పెరిగిపోతోంది. గిట్టుబాటు ధరలు రాక రైతులు అవస్థలు పడుతున్నారు. రైతులు కరువు, తుపాన్లతో అల్లాడిపోతున్నారు. వీటన్నింటికి చరమగీతం పాడుతాం. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతులకు తోడుగా ఉంటాను. రైతులు పెట్టుబడి కోసం ఎదురుచూసే సమయంలో సమస్య వస్తుంది. ప్రతి రైతుకు పెట్టుబడి తగ్గించే విధంగా కరెంటు ఉచితంగా అందజేస్తాం. ఇవాళ చంద్రబాబు ఎన్ని గంటలు ఇస్తారో తెలియదు. పగటి పూటే 9 గంటలు ఉచితంగా ఇస్తానని మాట ఇస్తున్నాను. రైతుల ఆదాయం పెంచేందుకు రైతులు తీసుకునే పంట రుణాలకు వడ్డీ లేకుండా సున్నా వడ్డీకే రుణాలు ఇస్తాం. జూన్‌ మాసంలో పంట వేసేందుకు ఎదురుచూసే సమయంలో పెట్టుబడి కోసం బ్యాంకులు, ప్రైవేట్‌ వ్యక్తుల వద్దకు వెళ్తారు. ప్రతి రైతుకు మే మాసంలోనే ఏడాదికి రూ.12,500 రైతుకు నేరుగా అందజేస్తాం. రాష్ట్రంలో 85 లక్షల రైతు కుటుంబాలు ఉన్నాయి. 42 లక్షల మంది రైతుల పరిస్థితి ఏంటంటే తక్కువ విస్తిర్ణంలో భూములు ఉన్నాయి. 70 శాతం మంది రైతులు ఇవాళ రెండున్నర ఎకరాల భూమి మాత్రమే ఉంది. ప్రతి రైతు కుటుంబానికి అక్షరాల రూ.12,500 ఇస్తాం. గతంలో వారు తీసుకున్న బ్యాంకు రుణాలతో సంబంధం లేకుండా డబ్బులు అందజేస్తాం. రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కారణం ఏంటో తెలుసా..బోర్లు వేసి అప్పులపాలు అవుతున్నారు. అలాంటి రైతుకు తోడుగా ఉండేందుకు ప్రతి రైతుకు బోరు ఉచితంగా వేయిస్తాం. రైతుల కోసం ఒక్క అడుగు ముందుకు వేస్తున్నాను. రైతులకు ఇన్సూరెన్స్‌ ఎప్పుడు ఇస్తారో తెలియదు. ప్రతి రైతుకు హామీ ఇచ్చి చెబుతున్నాను. ప్రభుత్వమే ఇన్సూరెన్స్‌ సొమ్మును ప్రభుత్వమే చెల్లిస్తుంది. అక్వా రైతులకు కరెంటు రేటు రూ.1.50కే ఇస్తాం. రైతులు గిట్టుబాటు ధర లేక అవస్థలు పడుతున్నారు. మన ప్రభుత్వం వచ్చాక పంట వేయకముందే గిట్టుబాటు ధర ప్రకటిస్తాం. ప్రతి మండలంలోనూ కోల్డు స్టోరేజీ ఏర్పాటు చేస్తాం. ఫుడ్‌ ప్రాస్సెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తాం. రైతుల కోసం మరో అడుగు ముందుకు వేస్తూ పాడి రైతులను ప్రోత్సహిస్తాం. పాడి ఉన్న ఇంటి సిరులు దోర్లునట..కవ్వమాడు ఇంటా కరువే ఉండదట. ఇవాళ పాడి రైతులకు మద్దతు ధర దక్కడం లేదు. లీటర్‌ నీళ్లు, లీటర్‌ పాలు రూ.20 చొప్పున అమ్ముతున్నారు. చంద్రబాబు తానే దళారీలకు నాయకుడై హెరిటేజ్‌ షాపుల్లో అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. లీటర్‌ అరలీటర్‌ రూ.45 చొప్పున అమ్ముతున్నారు. సహకార రంగంలో డయిరీలను ప్రోత్సహిస్తే రైతులకు మేలు జరుగుతుంది.  సహకార రంగంలో మంచిరేట్లు ఇస్తే ప్రైవేట్‌ డయిరీలు కూడా పోటీపడుతాయి. సహకార రంగానికి పాలు పోసిన ప్రతి రైతుకు లీటర్‌కు రూ.4 బోనస్‌ ఇస్తాం. ప్రతి రైతుకు వ్యవసాయరంగంలోని ట్రాక్టర్‌కు రోడ్డు ట్యాక్స్‌ రద్దు చేస్తాం. రైతు కష్టపడి పండించిన తరువాత కరువు, తుపాన్లు వచ్చినప్పుడు దిక్కుతోచని స్థితిలోకి వెళ్తారు. అక్షరాల రూ.3435 కోట్లు తిత్లీ తుపాను కారణంగా నష్టం వస్తే చంద్రబాబు కేవలం రూ.500 కోట్లు మాత్రమే ఇచ్చి పబ్లిసిటీ కోసం ఏ బస్సును వదలడం లేదు. ఏ ప్లేక్సీని వదలడం లేదు. తిత్లీ బాధితులకు మాట ఇస్తున్నాను.. రాష్ట్రవ్యాప్తంగా ఎవరికి ఏ నష్టం వచ్చినా కూడా ప్రకృతి వైఫరీత్యాల నిధి రూ.4 వేల కోట్లతో ఏర్పాటు చేస్తాం. రాష్ట్రం నుంచి రూ.2 వేల కోట్లు, కేంద్రం నుంచి రూ.2 వేల కోట్లు కేటాయిస్తుంది. ప్రతి రైతు ముఖంలో చిరునవ్వు ఉంటుందని మీ అందరికి చెబుతున్నాను. తిత్లీ తుపాను వచ్చినప్పుడు కొబ్బెర చెట్లు అన్నీ కూడా పడిపోయాయి. చంద్రబాబు ఇచ్చిన పరిహారం ఏ మూలకు సరిపోవడం లేదు. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంచి చేసే కార్యక్రమాలు చేపట్టి తోడుగా ఉంటాను. రైతు అనుకోకుండా తనువు చాలిస్తే ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలోకి వస్తుంది. రైతన్న పోయాడు..అప్పులవారు ఆ కుటుంబాన్ని పీడిస్తుంది. ఆ ప్రతి రైతుకు హామీ ఇస్తున్నాను. రైతులకు ఇలాంటిది జరుగకూడదని ప్రార్ధిస్తున్నాను. చనిపోయిన రైతు కుటుంబానికి రూ.5 లక్షలు ఇచ్చి తోడుగా ఉంటాం. అసెంబ్లీలోని మొట్టమొదటి చట్టసభలో శాసనం తీసుకువస్తాం. రైతులకు ప్రభుత్వం ఇచ్చే రూ.5 లక్షలు ఆడపడుచులకు ఇచ్చే కానుకగా పేర్కొంటూ చట్టం చేస్తాం. ఆ డబ్బుతో ఆ కుటుంబం కాస్తోకూస్తో నిలబడుతుంది. ఆ రైతన్న ఆకాశం నుంచి చూసి సంతోషపడేలా చేస్తాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, మహేంద్ర తనయ వంటి ప్రాజెక్టులు నత్తనడకన సాగుతున్నాయి. అంచనాలు పెంచి కాంట్రాక్టర్లకు మేలు చేస్తున్నారు. ప్రాజెక్టులు ముందుడుగు వేయడం లేదు. ప్రతి ప్రాజెక్టును యుద్ధప్రాతిపాదికన పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నాను. ఒక్కసారి అధికారంలోకి వస్తే 30 ఏళ్లు పాలించాలన్నదే నా ఆశ..ప్రతి ఒక్కరికి హామీ ఇస్తున్నాను. 

నవరత్నాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లండి
నవరత్నాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లండి..ప్రజలు జరుగబోయే ఆ మేళ్లు చూసి సంతోషపడాలి. ప్రతి గ్రామంలో కనీసం రెండు ప్లేక్సీలు పెట్టాలని కో–ఆర్డినేటర్లకు చెబుతున్నాను. నవరత్నాల్లోని ప్రతి అంశాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లాని చెబుతున్నాను. ప్రతి పేదవాడికి ఎలా మేలు చేయాలో ఈ పాదయాత్రలో ఆలోచన చేశాను. 14 నెలలు పేదవారితోనే ఉన్నాను. పేదవారి కష్టాలు వింటూనే..వారికి భరోసా కల్పిస్తూ ముందుకు సాగాను. అవగాహనతో ఉన్నాను..ప్రతి పేదవాడికి మంచి చేయాలనే తపన ఉంది. ఈ చెడిపోయిన వ్యవస్థను మార్చుతానని హామీ ఇస్తున్నాను. కలిసి రావాలని, తోడుగా ఉండమని, చెడిపోయిన వ్యవస్థను మార్చేందుకు బయలుదేరిన మీ బిడ్డకు తోడుగా ఉండమని, ఆశీర్వదించమని, ఈ పోరాటం ఇంకా కొనసాగుతుంది. 

మన యుద్ధం నారాసురుడు ఒక్కడితోనే కాదు..
మరో మూడు నెలల కాలంలో ప్రతి ఒక్కరు సహకరించాలని, అవినీతి పాలనను సాగనంపేందుకు తోడుగా ఉండాలన్నారు. ఈ యుద్ధం నారాసురుడు ఒక్కరే కాదు..ఆయనకు తోడుగా ఎల్లోమీడియా, వ్యవస్థలను మేనేజ్‌ చేసేవారున్నారు. జిత్తులు మారిన మాయ చంద్రబాబు అనేకమైన పొత్తులు పెట్టుకుంటారు. ఈ అన్యాయాలను, మోసాలను నేను జయిస్తాను..మీరంతా తోడుగా ఉంటే జయిస్తానని, తోడుగా ఉండమని, ఆశీర్వదించమని ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.

 
 

 

Back to Top