బూర్జ: ప్రస్తుతం తెలుగు దేశం పాలనలో దుర్భరమైన జీవితాన్ని అనుభిస్తున్న రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే వైయస్ఆర్ కుటుంబం నిర్వహిస్తున్నామని వైయస్సార్ సీపీ హై పవర్ కమిటీ సబ్యులు తమ్మినేని సీతారాం అన్నారు. కొల్లివలస గ్రామంలో వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమం తమ్మినేని ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ఆ కుటుంబంతో మాట్లాడారు. తమ్మినేనికి, పార్టీ నాయకులకు హారతు లిచ్చారు. పార్టీ అధినేత వైయస్ జగన్‌మోహనరెడ్డి ఇటీవల ప్రకటించిన నవరత్న పథకాలను గూర్చి వారికి వివరించి వైయస్సార్ కుటుంబంలో చేరాలని ఆహ్వానించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఫోటోతోవున్న స్టిక్కర్లను వారి ఇంటికి అతికించారు. వారి సెల్‌తో మిస్‌డ్ కాలిచ్చి నేరుగా జగనన్నతో మాట్లాడించారు. గత ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలలో ఏఏ హామీలు నెరవేర్చారు. ఏవి నెరవేర్చలేదో మీరే స్వయంగా కార్డును పరిశీలించి నిజాలు నిర్భయంగా నమోదు చేయాలని ఆ కుటుంబంతో మమేకమయ్యారు. ప్రభుత్వ వైఫల్యాలను సీతారాం దుయ్యపట్టారు. చంద్రబాబు కళ్ళబొల్లి మాటలు చెప్పి నయవంచన చేస్తాడని మరోసారి మోసపోవద్దన్నారు. తండ్రి ఆశయ సాధన కోసం జగనన్న ప్రకటించిన నవరత్నాల పథకం ప్రజల కోసమేనని త్వరలోనే మంచి రోజులొస్తాయన్నారు. ముందుగా సమావేశం నిర్వహించి వైయస్‌ఆర్ కుటుంబం కిట్లను బూత్ కమిటీ కన్వీనర్లకు ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి తమ్మినేని వెంకటచిరంజీవినాగ్,జిల్లా యువజనవిభాగం ప్రధాన కార్యదర్శి పేడాడ అశోక్‌కుమార్,మండల అద్యక్షుడు ఖండాపు గోవిందరావు,మండల యువజన విభాగం అద్యక్షుడు గుమ్మడి రాంబాబు,ప్రధాన కార్యదర్శి వావిలపల్లి గోవిందరావు,కార్యదర్శి మామిడి శ్రీనివాసరావు,సర్పంచ్‌లు వేపారి లక్ష్మీనారాయణ,జల్లు అప్పలస్వామినాయుడు,ఎంపీటీసీ బూరి శ్రీరామమూర్తి,బూత్ కమిటీ సబ్యులు సీర వెంకటరమణ,జీడి వేణు,పీస వీరన్న,నాయకులు కొరికాన వెంకటరావు,తొత్తడి సురేష్, మామిడి రాంబాబు,గేదెల శ్రీధర్, కొండల రావు,గడే సూరపునాయుడు,రామక్రిష్ణ,సాంబమూర్తి, కార్యకర్తలు పాల్గొన్నారు.<strong><br/></strong><strong>వైయస్ఆర్ కుటుంబంలో చేరిన అభిమానులు.....</strong>కొల్లివలస గ్రామంలో గురువారం తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో నిర్వహించిన వైయస్ఆర్ కుటుంబంలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు నున గొప్పల రామక్రిష్ణ, నునగొప్పల శంకర నారాయణతోపాటు మరో 20కుటుంబాలు వైయస్సార్ కుటుంబంలో చేరాయి. దీంతో ఆ గ్రామంలో జగనన్న నామస్మరణ మారుమోగింది.