వైయస్సార్‌ పాలన ఓ స్వర్ణయుగం

– నవరత్నాలతో పేదల జీవితాల్లో వెలుగులు
– వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమంలో వైవీఆర్‌

గుంతకల్లు టౌన్‌: దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌.రాజశేఖర్‌ రెడ్డి పాలన ఓ స్వర్ణయుగం లాంటిది. ఆ ప్రజా పరిపాలన మళ్లీ రావాలంటే వైయస్సార్‌సీపీను ఆదరించాలని ఆ పార్టీ నియోజకవర్గం సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి ప్రజలను కోరారు. వైయస్సార్‌సీపీతో ప్రజలను మమేకం చేయడమే లక్ష్యంగా చేపట్టిన వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమం బుధవారం పట్టణంలోని 34,35,19,1,15 వార్డుల్లో జరిగింది. పార్టీ సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి, 35వ వార్డు కౌన్సిలర్‌ అహ్మద్‌బాషా, 34వార్డు ఇన్‌ఛార్జ్‌ సుమోబాషాలు ఇంటింటికీ తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. వైయస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి అధికారంలోకి రాగానే అమలు చేసే నవరత్నాల్లాంటి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. 9121091210 నెంబర్‌కి మిస్డ్‌ కాల్‌ ఇచ్చి వైయస్సార్‌ కుటుంబంలో చేరాలన్నారు. వైయస్సార్‌ ఫ్యామిలీలోకి స్వచ్ఛందంగా చేరిన వారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి రావడానికి చంద్రబాబులా అడ్డదిడ్డమైన హామీలివ్వడం వైయస్సార్‌ తనయుడు వైయస్‌.జగన్‌మోహన్‌ రెడ్డికి చేతకాదన్నారు. ఏదైనా మాట ఇస్తే దాన్ని తూచా తప్పకుండా అమలు చేసే నైజం వైయస్సార్‌సీపీదేనన్నారు. అన్నివర్గాల ప్రజలు, మహిళలు, రైతాంగాన్ని దృష్టిలో ఉంచుకునే తమ పార్టీ అధినేత నవరత్నాలను ప్రకటించారని, ప్రజలందరి ఆశీర్వాదంతో అధికారంలోకి రాగానే ఆ సంక్షేమ పథకాలను అమలు చేసి బడుగు, బలహీన వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతామని చెప్పారు. 

Back to Top