గారాలమడుగు(పుల్లంపేట): వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టన నవరత్నాల గురించి ప్రజలకు తెలియజేయడంలో భాగంగా శుక్రవారం ఖాదర్‌పేట, గారాలమడుగు, హరిజనవాడ, మహబూబ్‌నగర్, పుల్లంపేటలోని శివాలయంవీధి తదితర గ్రామాల్లో వైయస్సార్‌సీపీ మండల ఇన్‌చార్జి ముద్దా బాబుల్‌రెడ్డి, బూత్‌కన్వీనర్లు భాస్కర్‌రెడ్డి, మణిల ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి నవరత్నాల గురించి ప్రజలకు తెలియజేస్తూ వైయస్సార్ కుటుంబంలో చేర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బాబుల్‌రెడ్డి మాట్లాడుతూ.... చంద్రబాబు నాయుడు ఏ ఒక్క హామీలు నెరవేర్చకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకోసం 9 సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, వాటిద్వారా ప్రతి పేదవాడికి లబ్దిచేకూరాలనే లక్ష్యంతో ఇంటింటికి తిరిగి ప్రజలకు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పుల్లంపేట ఉపసర్పంచ్ శ్రీకాంత్, కుమార్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, రామనాథం, మల్లికార్జునరెడ్డి, రమణారెడ్డి, శంకర్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, కృష్ణారెడ్డి, శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.<br/>