కర్నూలు: రాయలసీమ ప్రాంతంలో తీవ్ర కరువుతో ప్రజలు అల్లాడుతుంటే..ప్రభుత్వం ఎలాంటి నివారణ చర్యలు చేపట్టడం లేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీశైలం నియోజకవర్గ ఇన్‌చార్జ్ బుడ్డా శేషారెడ్డి మండిపడ్డారు. వెలుగోడు పట్టణంలో ఆయన గడప గడపకూ వైయస్ఆర్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వర్షాభావ పరిస్థితుల కారణంగా జిల్లాలో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పాడ్డాయన్నారు. పంటలు దెబ్బతిని రైతులకు పెట్టుబడులు కూడా చేతికందే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి సహాయక చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. చాలా గ్రామాల్లో నీటి ఎద్దడి నెలకొందని, చెంతనే వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఉన్నా..పట్టణంలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని ధ్వజమెత్తారు. పంటలకు మద్దతు ధర కోసం వైయస్ జగన్ మోహన్‌రెడ్డి మే 1, 2వ తేదీల్లో గుంటూరు కేంద్రంగా నిరాహార దీక్ష చేపడుతున్నట్లు శేషారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ మండల నాయకులు ఇలియాస్‌ఖాన్, అంబాల ప్రభాకర్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డి, జయరామిరెడ్డి పాల్గొన్నారు.<br/>-కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం పుతపష్మం గ్రామంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట జగన్‌మోహన్‌రెడ్డి గడప గడపకూ వైయస్ఆర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటా పర్యటించిన జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా బ్యాలెట్‌ను పంపిణీ చేసి చంద్రబాబు పాలనపై మార్కులు వేయించారు.