గుక్కెడు నీళ్ల కోసం పడరాని పాట్లు

సూళ్లూరుపేటః గుక్కెడు నీళ్ల కోసం పడరాని పాట్లు పడుతున్నామని కేసీఎన్ గుంట గ్రామానికి చెందిన మహళలు ఎమ్మెల్యే సంజీవయ్యకు మొరపెట్టుకున్నారు. గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమంలో భాగంగా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కె. సంజీవయ్య కేసీఎన్ గుంట పంచాయతీలో పర్యటించారు. ఇంటింటికీ తిరిగి ప్రజాబ్యాలెట్ అందజేశారు. ప్రజలు నమ్మి ఓట్లేసినందుకు గ్రామాల్లో తాగునీరు ఇవ్వలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉండడం సిగ్గుచేటన్నారు. కేసీఎన్ గుంటలో ఓవర్ హెడ్ ట్యాంకు ఉండి కూడ నిరుపయోగంగా వదిలేయడమేంటని ప్రశ్నించారు. నాయుడుపేట నగర మున్సిపాలిటీ తీరు దారుణంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  రాబోయే ఎన్నికల్లో మోసపూరిత ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని సంజీవయ్య ప్రజలకు పిలుపునిచ్చారు.


Back to Top