అవినీతి సర్కార్ కు బుద్ధి చెప్పండి

ప్ర‌జాబ్యాలెట్‌తో బాబుకు బుద్ధి చెప్పండి
నంద్యాల‌:  ప్ర‌జాబ్యాలెట్ ద్వారా చంద్ర‌బాబుకు ప్ర‌జ‌లే బుద్ది చెప్పాల‌ని వైయ‌స్సార్‌సీపీ నంద్యాల నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ రాజ‌గోపాల్‌రెడ్డి అన్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయస్సార్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న మండ‌ల ప‌రిధిలోని బ్రాహ్మ‌ణ‌ప‌ల్లెలో ప‌ర్య‌టించారు. రెండున్నరేళ్ల పాల‌న‌లో చంద్ర‌బాబు అవినీతిలో కూరుకుపోయార‌ని, అవినీతి ర‌హిత పాల‌న వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డితోనే సాధ్య‌మ‌ని చెప్పారు.

అన్ని వర్గాలను మోసం చేశాడు
ఆళ్ల‌గ‌డ్డ‌:  కాల‌నీ ప్ర‌జ‌లు క‌నీస సౌక‌ర్యాల‌కు నోచుకోలేక‌పోయామ‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజ‌వ‌క‌ర్గ ఇంచార్జ్ రామ‌లింగారెడ్డి అన్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న ప‌ట్ట‌ణంలోని ఇమ్మాన్యుయేల్ చ‌ర్చి, ఏసునాధ‌పురం ప్రాంతాల్లో ప‌ర్య‌టించారు. టీడీపీ అధికారంలోకి వ‌స్తే పొదుపు రుణాల‌న్నీ మాఫీ చేస్తామ‌ని చెబితే ఇంటిల్లిపాది ఓట్లు వేసి గెలిపించార‌న్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబు ఇటు వృద్ధుల‌ను, అటు యువ‌త‌ను, మ‌హిళ‌ల‌ను, నిరుద్యోగుల‌ను, విద్యార్థుల‌న్న తేడా లేకుండా అంద‌రినీ మోసం చేశార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. చంద్ర‌బాబు ఇప్ప‌టికైనా బుద్ధి తెచ్చుకొని ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చాల‌ని డిమాండ్ చేశారు. 

గ‌డ‌ప‌గ‌డ‌ప‌లో విశేష ఆదరణ
కోడుమూరు:  ఏ గ‌డ‌ప‌కెళ్లినా... ఏ మ‌నిషిని ప‌ల‌క‌రించినా స‌మ‌స్య‌లే ద‌ర్శ‌న‌మిస్తున్నాయ‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ ముర‌ళీకృష్ణ అన్నారు. చంద్ర‌బాబు మోస‌పూరిత హామీల‌ను నమ్మి అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు బ‌లైపోయార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌లో ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ ల‌భిస్తుంద‌ని, చంద్ర‌బాబుపై త‌మ‌కున్న ఆగ్ర‌హాన్ని ప్ర‌జ‌లు ఈ కార్యక్ర‌మం ద్వారా బ‌ట్ట‌బ‌య‌లు చేస్తున్నార‌న్నారు. 

Back to Top