నవరత్నాలతో రాజన్న స్వర్ణయుగం

కందుకూరు అర్బన్‌ : నవరత్నాలతో రాష్ట్రంలో రాజన్న స్వర్ణయుగాన్ని వైయస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొస్తారని ఆ పార్టీ కందుకూరు నియోజకవర్గ ఇంచార్జ్ తూమాటి మాధవరావు అన్నారు. మంగళవారం మున్సిపాలిటీలోని 19,20 వార్డులలో ఇంటింటికి వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేసి నవరత్నాలపై విసృత ప్రచారం చేశారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  అధికారంలోకి వచ్చి మూడన్నరేళ్లు గడస్తున్నా బాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను  నేరవేర్చలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాధవరావు మాట్లాడుతూ... జగన్‌ సారథ్యంలో  వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు, విద్యార్ధులకు, మహిళలకు, నిరుద్యోగులకు, వితంతువులకు, వృద్ధులకు, దివ్వాంగులకు నవరత్నాలు అండగా నిలుస్తాయని చెప్పారు. జగన్‌ ప్రకటించిన నవరత్నాలతో చంద్రబాబు నాయుడు వెన్నులో వణుకు మొదలైందన్నారు. టీడీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో విఫలమైందన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో పేదలకు చేరాల్సిన పధకాలు టీడీపీ నాయకులే మింగేస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో టీడీపీ పాలనపై విసుగు చెందిన ప్రజలు స్వచ్ఛందంగా వైయస్సార్‌ కుటుంబంలో చేరుతున్నారని పేర్కొన్నారు. రాజన్న రాజ్యం రావాలంటే జగన్‌ను సీఎం చేయాలని పిలుపునిచ్చారు. వైయస్సార్‌ కుటుంబంలో చేరాలనుకునేవారు సెల్‌ నంబర్‌ 91210 91210కు మిస్డ్‌కాల్‌ ఇచ్చి చేరాలన్నారు. కార్యక్రమంలో గణేషం గంగిరెడ్డి, పొడపాటి కోటేశ్వరరావు, కూరపాటి వెంకటరామిరెడ్డి, పంది కోటేశ్వరరావు, జంగిలి థామస్, సన్ని, మాజీ కౌన్సిలర్‌ వెంకటస్వామి, యాసీన్, ఖాదర్‌బాషా, వెంకట్, బల్లిపల్లి మాల్యాద్రి, సుబ్బారావు, నాగసూరి బ్రహ్మయ్య, ద్రోణాదుల మణి, చనమాల కిరణ్, తన్నీరు రమేష్, జె, కోటేశ్వరరావు, కూనం రామకృష్ణారెడ్డి, మాలకొండయ్య, ఇంటూరి నరసయ్య, పత్తిపాలి నరసింహరావు, ఆర్టీసీ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top