ఇన్‌పుట్ స‌బ్సిడీని ఎగ్గొట్టేందుకే రెయిన్‌గ‌న్స్‌

పెద్దతిప్పసముద్రం:   స‌రైన వ‌ర్షాలు కుర‌వ‌క‌పోవ‌డంతో పంట‌ల‌న్నీ
ఎండిపోతే అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదని, రెయిన్‌గ‌న్‌ల‌తో   చేతులు
దులుపుకొని పోతున్నార‌ని ప‌లువురు రైతులు తంబ‌ళ్ళ‌ప‌ల్లి వైయ‌స్సార్ కాంగ్రెస్
పార్టీ పెద్దిరెడ్డి ద్వాకానాథ్‌రెడ్డి ఎదుట వాపోయారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్
కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న పోతుపేట‌, యంపార్ల‌ప‌ల్లి, చేలూరువాండ్ల‌ప‌ల్లి, పిడింవారిప‌ల్లి, సొన్నువారిప‌ల్లి, కొత్త‌ప‌ల్లి గ్రామాల్లో ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల
స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.... రెయిన్‌గ‌న్స్
తో రైతుల‌కు ఎలాంటి ల‌బ్ధి చేకూర‌ద‌న్నారు. ఇన్‌ఫుట్ స‌బ్సిడీని ఎగ్గొట్టేందుకే
రెయిన్‌గ‌న్స్  తీసుకొచ్చార‌ని ఆయ‌న మండిప‌డ్డారు.
అనంత‌రం వంద‌ప్ర‌శ్నల‌తో కూడిన ప్ర‌జాబ్యాలెట్‌ను అంద‌జేసి బాబు మోస‌పూరిత పాల‌న‌పై
మార్కులు వేయించారు. వైయ‌స్సార్‌సీపీ బ‌లోపేతం కోసం ప్ర‌తి ఒక్క‌రూ సైనికుల్లా ప‌ని
చేయాల‌ని ఆయ‌న సూచించారు. 

 

తాజా ఫోటోలు

Back to Top