చంద్ర‌బాబు పాల‌న‌లో పేదోడి జీవితం అస్త‌వ్య‌స్తం

గొల్లవిల్లి(ఉప్పలగుప్తం):  చంద్ర‌బాబు ప‌రిపాల‌న‌లో పేదోడి జీవనం అస్తవ్యస్తంగా మారింది... మూడేళ్ళుగా ఇల్లులేని నిరుపేదలకు ఒక్క ఇళ్లు కూడా మంజూరు చేయ‌లేక‌పోయార‌ని ప్ర‌జ‌లు మొర‌పెట్టుకుంటున్నారు. సొంతింటి కల నెరవేర్చలేక పోయారు...ఎక్కడ ఏ లబ్ధిదారునికి ఒక్క సంక్షేమ పధకం అందించిన దాఖలాలు లేవు...చంద్రబాబు పాలనలో పేదోడి జీవనం కష్టమే...అంటూ గడప గడపకూ వైయ‌స్ఆర్‌ కార్యక్రమంలో ప్రభుత్వంపై ప్రజలు దుమ్మెత్తి పోశారు. అమ‌లాపురం నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని గొల్లవిల్లిపంచాయతీ ఇందిరానగర్, అశోక్‌నగర్, అంబేడ్కర్‌నగర్‌ ప్రాంతాలతో పాటు శెట్టిబలిజ పేటల్లో గడప గడపకూ వైయ‌స్ఆర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా పార్టీ పీఏసీ సభ్యులు, నియోజకవర్గ కోఆర్డినేటర్‌ పినిపే విశ్వరూప్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీను, సంయుక్త కార్యదర్శి పుట్రేవు చందు, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి మోటూరి సాయి, జిల్లా అధ్యక్షుడు జిన్నూరి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఇంటింటికి తిరుగుతూ చంద్ర‌బాబు మోసాల‌పై ముద్రించిన ప్ర‌జా బ్యాలెట్‌ను అందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యుల జీవితాలతో ఆడుకోంటున్నాయని, నిత్యవసర సరుకుల ధరలతో సామాన్యులు పడుతున్న ఇబ్బందులను వారి ముందు ఏకరువుపెట్టారు. ఇళ్ళు లేని నిరుపేదలను పట్టించుకోవడం లేదని, ప్రభుత్వ సంక్షేమ పధకాలు దరి చేరడం లేదంటూ ప్రజలు వాపోయారు. జిల్లా, నియోజకవర్గ నాయకులు గనిశెట్టి రమణ్‌లాల్, చప్పిడి వెంకటేశ్వరరావు, జినిపే మహలక్ష్మి, దోనిపాటి రాంబాబు, ఎలిపే నాగేశ్వరరావు, వెంకట్రావు, ములపర్తి చిన్న, బూసి గోపాలం, రాయుడు వెంకటేశ్వరరావు, గుత్తుల బోసు, బాబ్జీ, దానేశ్వరరావు, దేవరపల్లి రాంబాబు, వెంకటేశ్వరరావు, మారిశెట్టి పుండరీకాక్షుడు, గొలకోటి దోరబాబు, చిట్టిబాబు, మురమళ్ళ రామం, సూదా లక్ష్మీనారాయణ, కంచుమర్తి వెంకన్న, మట్టపర్తి బులిస్వామి, మోటూరి సత్యంకాపు, బడుగు అబ్బులు, శ్రీను, పోగాకు శ్రీను, సుంకర వెంకటనారాయణ, మామిడిపల్లి సత్యనారాయణ, నాగిరెడ్డి నాగబాబు, భోగిశెట్టి నర్సింగ్, మహదశ సుబ్బారావు, మారిశెట్టి నరేష్, నిమ్మకాయల కాశి, కుంచే స్వామి, పొలమూరి బాబులు, రంఠంశెట్టి బుజ్జి, మెండి సురేష్‌కుమార్, గనిశెట్టి సద్గురురావు, కాట్రు కృష్ణ, ఆకుల చిన్ని, కొంకి బాలకృష్ణ, అయితాబత్తుల సూరిబాబు, పండు చిరంజీవి తదితరులు ఉన్నారు.

Back to Top