ప్ర‌జాస‌మ‌స్య‌లు గాలికొదిలేసిన చంద్ర‌బాబు

తూర్పుగోదావ‌రి: చ‌ంద్ర‌బాబు ప్ర‌భుత్వ గ‌ద్దెనెక్కిన త‌రువాత ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను గాలికొదిలేశాడ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వేగుళ్ల లీలాకృష్ణ మండిప‌డ్డారు. తూగో జిల్లా మండ‌పేట ప‌ట్ట‌ణం 27వ వార్డులో లీలాకృష్ణ గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఇంటింటికి తిరుగుతూ చంద్ర‌బాబు మోసాల‌పై ప్ర‌చురించిన ప్ర‌జాబ్యాలెట్‌ను అందించి బాబు పాల‌న‌పై మార్కులు వేయించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ ప‌ట్ట‌ణంలో అర్హులైన ల‌బ్దిదారుల‌కు పెన్ష‌న్ అంద‌క అవ‌స్థులు ప‌డుతున్నార‌న్నారు. వృద్ధులు, వితంతువుల‌, విక‌లాంగులు పెన్ష‌న్ కోసం ఎన్నిసార్లు అధికారుల‌కు ద‌ర‌ఖాస్తు పెట్టుకున్న మంజూరు చేయ‌డం లేద‌ని మండిప‌డ్డారు. ఎన్నిక‌ల ముందు వంద‌ల కొద్ది మోస‌పూరిత హామీలు ఇచ్చి ప్ర‌జ‌ల‌ను చంద్ర‌బాబు వంచించార‌న్నారు. 2019లో వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నేతృత్వంలో రాజ‌న్న రాజ్యం వ‌స్తుంద‌న్నారు. మోస‌కారి చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌లు త‌గిన గుణ‌పాఠం చెప్పాల‌ని సూచించారు.  కార్యక్రమంలో పార్టీ నేత‌లు  పడాల సతిష్, సరకుల అబ్బులు, పొలమాల సత్తిబాబు,పొలమూరి విజయ్, షేక్ భాష, షేక్ కర్రీమ్, ఎరుబోతు రాజబాబు త‌దిత‌రులు పాల్గొన్నారు. 


Back to Top